LOADING...
Jasprit Bumrah: బుమ్రాకు గాయం.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడంపై సందేహాలు!
బుమ్రాకు గాయం.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడంపై సందేహాలు!

Jasprit Bumrah: బుమ్రాకు గాయం.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడంపై సందేహాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 08, 2025
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరి టెస్టులో టీమిండియా పేసర్ జస్పిత్ బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడారు. ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అతడి పాల్గొనడంపై సందేహాలు తలెత్తాయి. టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకారం, వెన్నునొప్పి ఉంటే బుమ్రా కచ్చితంగా రికవరీ కానున్నాడు. కానీ ఒకవేళ గ్రేడ్-1 తీవ్రత కలిగిన ఫ్రాక్చర్ అయితే అతడు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనకపోవచ్చని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పేర్కొంది. ఈ విషయంపై సెలక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. వెన్నునొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే, బుమ్రా కొంతకాలం జట్టుకి అందుబాటులో ఉండకపోవచ్చు. మెడికల్ పరీక్షల ఫలితాలను బట్టి సెలక్టర్ల నిర్ణయం తీసుకోనున్నారు.

Details

సమస్యను బట్టి నిర్ణయం తీసుకొనే అవకాశం

గతంలో కూడా బుమ్రా వెన్నునొప్పి ఫ్రాక్చర్‌తో బాధపడ్డ కారణంగా ఈ ఆందోళనలు ఎక్కువయ్యాయి. అందుకే వీలైనంత త్వరగా విరామం తీసుకుని రికవరీ చెయ్యాలని టీమిండియా మాజీ క్రికెటర్లు సూచించారని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' రిపోర్ట్ చేసింది. ఈ సమయానికి జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి మెడికల్ రిపోర్ట్ సర్జన్‌ పరిశీలన కోసం పంపించారు. సమస్య తీవ్రత పెద్దగా లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే ఆటగాళ్ల జాబితాలో బుమ్రా పేరు ఉంటుంది. ఇంకా బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో పాటు రెండు మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించి రాణించడంతో, అతన్ని ఎంపిక చేస్తే మెరుగైన ఫలితాలు రావచ్చని సెలక్టర్లు భావిస్తున్నారు.