IND vs SA: ఐదు వికెట్లతో చెలరేగిన బుమ్రా.. దక్షిణాఫ్రికా 159కి అలౌట్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు (IND vs SA) తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్కోరు కేవలం 159 పరుగులకు ఆలౌటైంది. ఫాస్ట్ బౌలర్ జస్పిత్ బుమ్రా అద్భుత బౌలింగ్‌తో 27 రన్స్ ఇచ్చి అయిదు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను పడగొట్టాడు. దీంతో సఫారీలు చేతులెత్తేశారు. సౌతాఫ్రికాలో ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేయలేకపోయాడు. టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు ఆశించిన ప్రతిభను చూపలేకపోయారు. ఓపెనర్లు ప్రారంభంలో మెరుగ్గా రాణించినా, ఆ జోరు కొనసాగించలేకపోయారు.
Details
ఐదు వికెట్లు పడగొట్టడం ఇది 16వ సారి
తొలి వికెట్ 57 రన్స్ వద్ద పడింది. ఆ తర్వాత కేవలం 102 రన్స్‌లో మిగిలిన 9 వికెట్లు చేజార్చారు. తొలి రోజు కేవలం 55 ఓవర్లపాటు ఆడిన సఫారీలు ఇలా తక్కువ స్కోరుకే వెనుతిరిగారు. టెస్టులలో బుమ్రా ఐదు వికెట్లు తీసుకోవడం ఇది 16వ సారి. ఇక భారత బౌలర్లలో సిరాజ్, కుల్దీప్ తలా రెండు వికెట్లు తీసి జట్టుకు కీలక మద్దతునిచ్చారు.