LOADING...
Jasprit Bumrah: ఒక్క వికెట్‌తో చరిత్ర సృష్టించనున్న బుమ్రా.. వారి సరసన నిలిచే అవకాశం!
ఒక్క వికెట్‌తో చరిత్ర సృష్టించనున్న బుమ్రా.. వారి సరసన నిలిచే అవకాశం!

Jasprit Bumrah: ఒక్క వికెట్‌తో చరిత్ర సృష్టించనున్న బుమ్రా.. వారి సరసన నిలిచే అవకాశం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2025
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్‌ పేసర్‌ జస్పిత్ బుమ్రా (Jasprit Bumrah) మరో విశేష రికార్డుకు అంచున నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగనున్న ఐదో టీ20లో బుమ్రా ఒక్క వికెట్‌ తీస్తే, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 100 వికెట్లు పూర్తి చేస్తాడు. దీంతో అన్ని ఫార్మాట్లలో 100 వికెట్లు దాటిన ఐదో బౌలర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. ఇప్పటి వరకు ఈ అరుదైన ఘనతను లసిత్‌ మలింగ, షకిబ్‌ అల్‌ హసన్‌, టిమ్‌ సౌథీ, షహీన్‌ అఫ్రిది మాత్రమే సాధించారు. ఇక భారత్‌ తరఫున టీ20ల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కూడా బుమ్రా రికార్డు బుక్‌లో స్థానం సంపాదించనున్నాడు.

Details

అరుదైన రికార్డుకు చేరువలో తిలక్ వర్మ

ప్రస్తుతం అర్ష్‌దీప్‌ సింగ్‌ (105 వికెట్లు) మాత్రమే ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ నేపథ్యంలో గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో (నవంబర్‌ 8) జరిగే తుదిమ్యాచ్‌లో బుమ్రా ఈ మైలురాయిని అందుకునే అవకాశముంది. బ్యాటింగ్‌ విభాగంలో కూడా మరో రెండు భారత యువ ఆటగాళ్లు చారిత్రాత్మక మైలురాయికి చేరువలో ఉన్నారు. తిలక్‌ వర్మ ఆస్ట్రేలియాతో ఐదో టీ20లో కేవలం నాలుగు పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేస్తాడు. అలాగే అభిషేక్‌ శర్మ కూడా 11 పరుగులు చేస్తే వెయ్యి పరుగుల మార్క్‌ చేరుకుంటాడు.

Details

 2-1 ఆధిక్యంలో టీమిండియా

మరోవైపు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్లు మార్కస్‌ స్టాయినిస్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ చెరో వికెట్‌ తీస్తే టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకుంటారు. ఇక సిరీస్‌ విషయానికొస్తే.. తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొందగా, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. గబ్బా వేదికగా జరగనున్న ఐదో, తుదిమ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని సూర్యకుమార్‌ యాదవ్‌ సేన కట్టుదిట్టంగా సిద్ధమవుతోంది.