
CSK vs RCB: చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్రను మార్చగలదా?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమరం ఇవాళ చెపాక్ వేదికగా జరగనుంది.
ఐపీఎల్‌లో అత్యధిక ప్రజాదరణ పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు ఎదురుపడుతున్నాయి.
ఈ మ్యాచ్‌లో దిగ్గజ ఆటగాళ్లు ఎంఎస్ ధోని (MS Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli) మైదానంలో తలపడనున్నారు. ఇరుజట్ల బలాబలాలు, గత మ్యాచ్‌ల విశ్లేషణపై ఒకసారి పరిశీలిద్దాం.
Details
హెడ్ టు హెడ్ రికార్డులివే
ఈ సీజన్‌లో చెన్నై, బెంగళూరు చెరో మ్యాచ్ ఆడి విజయం సాధించాయి. కోల్‌కతాపై ఘనవిజయం సాధించిన బెంగళూరు జోష్‌లో ఉండగా, ముంబయి ఇండియన్స్‌ను మట్టికరిపించిన చెన్నై ఆత్మవిశ్వాసంతో ఉంది.
ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే, ఆర్సీబీ మధ్య 33 మ్యాచ్‌లు జరిగాయి. అందులో 21 సార్లు చెన్నై విజయం సాధించగా, బెంగళూరు కేవలం 11 విజయాలు మాత్రమే సాధించింది.
ఒక్క మ్యాచ్ ఫలితం తేలలేదు. చెపాక్ మైదానంలో ఆర్సీబీ రికార్డు అంతంత మాత్రమే. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌ను మినహాయించి, ఆ తర్వాత జరిగిన ఎనిమిది మ్యాచ్‌ల్లో చెన్నైనే గెలుపొందింది.
గత 17 ఏళ్లలో చెపాక్‌లో ఆర్సీబీ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది.
Details
స్పిన్నర్ల ఆధిపత్యం - కీలకం ఎవరు?
చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్‌లోనూ ముంబయి-చెన్నై మ్యాచ్‌లో స్పిన్నర్లు కీలకపాత్ర పోషించారు. చెన్నై తరఫున నూర్ అహ్మద్, అశ్విన్, రవీంద్ర జడేజా ఉన్నారు.
మరోవైపు, బెంగళూరు తరఫున కృనాల్ పాండ్య, సుయాశ్ శర్మ, లివింగ్‌స్టోన్‌లపై భారీ భారం ఉంది.
ఆర్సీబీ బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ కీలకంగా మారనున్నారు.
ఇక చెన్నై తరఫున రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేస్తారు. స్పిన్ బౌలింగ్‌ను అధిగమించిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువ.
Details
గత మ్యాచ్‌లో ఏమైందంటే?
ఆర్సీబీకి సీఎస్కేపై రికార్డు అంత బలంగా లేకపోయినా, ఇరుజట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించింది.
2024లో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ సంచలన విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు చేరింది.
చివరి ఓవర్‌లో 18 పరుగులు చేయాల్సిన సీఎస్కే లక్ష్యాన్ని చేరడంలో విఫలమైంది.
ఆర్సీబీ బౌలర్ యశ్ దయాళ్ అద్భుత బౌలింగ్‌తో కేవలం 7 పరుగులే ఇచ్చి, చివరి క్షణంలో ఎంఎస్ ధోనీ వికెట్ తీసాడు.
ఇవాళ జరిగే మ్యాచ్ ఐపీఎల్ 2025లో అత్యంత ఆసక్తికరమైన సమరంగా మారనుంది.
చెపాక్‌లో ఆర్సీబీ 17 ఏళ్లుగా విజయం సాధించలేకపోవడం, సీఎస్కే బలమైన స్పిన్ విభాగంతో సిద్ధంగా ఉండటంతో ఈ పోరుకు మరింత రసవత్తరంగా సాగనుంది.