LOADING...
Rohit Sharma: కెప్టెన్సీ మార్పు?.. రోహిత్ శర్మతో సెలెక్టర్లు కీలక సమావేశం!
కెప్టెన్సీ మార్పు?.. రోహిత్ శర్మతో సెలెక్టర్లు కీలక సమావేశం!

Rohit Sharma: కెప్టెన్సీ మార్పు?.. రోహిత్ శర్మతో సెలెక్టర్లు కీలక సమావేశం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2025
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా అక్టోబర్‌ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటన ప్రారంభిస్తోంది. ఈ సిరీస్‌లో ఆ జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ శనివారం స్వాడ్‌ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అయితే, స్వాడ్ ప్రకటించకముందు వన్డే కెప్టెన్సీ విషయంపై రోహిత్ శర్మతో సెలక్టర్లు చర్చించనున్నట్లు తెలుస్తోంది. వన్డే కెప్టెన్‌గా కొనసాగించాలా, లేదా అన్న అంశాన్ని సెలక్టర్లు నేరుగా రోహిత్‌తో చర్చించాలని యోచిస్తున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావలేదు. రోహిత్ ఇటీవలే బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తన ఫిట్‌నెస్ పరీక్షను క్లియర్ చేశారు. విరాట్ కోహ్లీ అభ్యర్థన మేరకు ఈ పరీక్ష ఇంగ్లాండ్‌లో నిర్వహించారు.

Details

టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిన రోహిత్, విరాట్

ప్రస్తుతానికి భారత జట్టు అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో తొలి టెస్ట్ ఆడుతోంది. ఆసియా కప్ ముగిసిన వెంటనే జస్‌ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్ వెస్టిండీస్ టూర్‌లో చేరారు, అయితే వర్క్‌లోడ్ కారణంగా ఈ ఇద్దరూ ఆస్ట్రేలియా టూర్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. గిల్‌ను వన్డేల్లో విశ్రాంతి ఇవ్వడం, టీ20లో ఆడించాల్సిన అవకాశం కూడా ఉంది. ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడిన రిషబ్ పంత్ ఆస్ట్రేలియా టూర్‌లో పాల్గొనవచ్చుననే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్టులు, టీ20లకు తమ రిటైర్మెంట్ ప్రకటించారు.

Details

చివరిసారిగా ఐసీసీ ట్రోఫీలో ఆడిన విరాట్, రోహిత్

వీరిద్దరూ చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరపున ఆడారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత వన్డే జట్టులో చేరే అవకాశాలు ఉన్నా, 2027లో సౌతాఫ్రికాలో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి రోహిత్‌శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించే అవకాశం కనిపించడం లేదు. అయితే ఈ సిరీస్‌లో విఫలమైతే భవిష్యత్తులో ఇది చర్చకు కారణం కావచ్చు. ఈ సీజన్‌లో టీమిండియా కేవలం తొమ్మిది వన్డేలు మాత్రమే ఆడనుంది. బీసీసీఐ టీ20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌పై దృష్టి సారించింది.