Shreyas Iyer: రిషబ్ పంత్ స్థానంలో శ్రేయస్‌కి కెప్టెన్సీ?.. భరోసా ఇచ్చిన జీఎంఆర్ గ్రూప్!
ఐపీఎల్ మెగా వేలానికి ముందు రిటెన్షన్ లిస్ట్ రిలీజైన విషయం తెలిసిందే. గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు ఛాంపియన్‌షిప్‌లో కీలకంగా నిలిచిన టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌ను ఆ జట్టు రిటైన్ చేయకపోవడం అనేక ఆశ్చర్యాలు రేకెత్తించింది. అతని ఐపీఎల్ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. శ్రేయస్ ఎలాంటి జట్టుకు చేరతాడన్న దానిపై ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. శ్రేయస్ ఐపీఎల్‌లో మరోసారి దిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడే అవకాశం ఉందని సమాచారం. దిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని జీఎంఆర్ గ్రూప్ అతడిని కొనుగోలు చేసే యోచనలో ఉందని తెలిసింది.
రిటెన్షన్ లిస్ట్ లో ముగ్గురు కెప్టెన్లు
వేలంలో శ్రేయస్‌ను కొనుగోలు చేయడానికి ఈ జట్టు సుమారు రూ.73 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా దిల్లీ క్యాపిటల్స్‌కు శ్రేయస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు కాబట్టి, అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవాలనే ఆలోచన జీఎంఆర్ గ్రూప్ లో ఉందట. కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ప్రకారం, కేకేఆర్ మొదటి రిటెన్షన్ ఎంపికగా శ్రేయస్‌ను పెట్టాలని భావించినప్పటికీ, ఒప్పందం కుదరకపోవడంతో అతడిని వేలంలోకి పంపించారు. ప్రస్తుతం రిటెన్షన్ లిస్ట్‌లో మూడు ప్రధాన సారథులు మెగా వేలంలో ఉండనున్నారు. రిషబ్ పంత్ కూడా ఈ జాబితాలో ఉండగా, దిల్లీ సారథిగా శ్రేయస్‌ను తిరిగి తీసుకోవాలన్న ఆసక్తిని జీఎంఆర్ గ్రూప్ ప్రదర్శించింది.