LOADING...
French Open 2025: ఫ్రెంచ్ ఓపెన్‌ టైటిల్‌ విజేత కార్లోస్ అల్కరాస్.. రికార్డు బద్దలు 
ఫ్రెంచ్ ఓపెన్‌ టైటిల్‌ విజేత కార్లోస్ అల్కరాస్.. రికార్డు బద్దలు

French Open 2025: ఫ్రెంచ్ ఓపెన్‌ టైటిల్‌ విజేత కార్లోస్ అల్కరాస్.. రికార్డు బద్దలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో కార్లోస్ అల్కరాస్ విజయఢంకా మోగించాడు. ప్రత్యర్థి జనిక్ సినర్‌పై 4-6, 6-7 (7/4), 6-4, 7-6 (7/3), 7-6 (10/2) తేడాతో ఘనంగా గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ పోరాటం దాదాపు ఐదున్నర గంటల పాటు సాగింది. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలోనే అత్యంత పొడవుగా సాగిన ఫైనల్ మ్యాచ్‌గా ఇది రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకుముందు 1982లో జరిగిన ఫైనల్లో 4 గంటల 42 నిమిషాల పాటు మ్యాచ్ సాగింది.

వివరాలు 

మొదటి రెండు సెట్లు సినర్ ఆధిపత్యమే 

ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న జనిక్ సినర్, ఫైనల్‌ ప్రారంభం నుంచే తన దూకుడు ప్రదర్శించాడు. తొలి రెండు సెట్లను వరుసగా గెలుచుకొని తన ఆధిక్యతను చాటాడు. రోలాండ్ గారోస్‌లో వరుసగా రెండో టైటిల్ గెలవాలని లక్ష్యంగా ముందుకు సాగిన అతడు ప్రారంభంలో చాలానే ఇబ్బంది పడ్డాడు. తొలి సెట్‌ను 6-4 తేడాతో చేజార్చుకున్నాడు. రెండో సెట్లో అల్కరాస్ తీవ్రంగా పోరాడినప్పటికీ, టైబ్రేక్‌లో 6-7 (4/7) తేడాతో ఓటమిని చవిచూశాడు. ఆ రెండు సెట్లు గెలిచిన తర్వాత సినర్ విజయానికి దగ్గరపడ్డాడని, ఇక అల్కరాస్ గెలవలేడనేది చాలామందీ అంచన వేశారు. కానీ అక్కడినుంచే అసలు డ్రామా మొదలైంది.

వివరాలు 

అద్భుతంగా పుంజుకున్న అల్కరాస్ 

రెండు సెట్లు కోల్పోయిన తర్వాత తిరిగి టోర్నమెంట్‌లోకి రావడం అంత తేలిక కాదు. కానీ అల్కరాస్‌ మాత్రం ఏమాత్రం నెమ్మదించలేదు. మూడో సెట్లో తన మానసిక బలాన్ని చాటుతూ 6-4 తేడాతో గెలిచి మ్యాచ్‌ను కొనసాగించాడు. నాలుగో సెట్లో ఓడే పరిస్థితికి చేరినా, సినర్ విన్నింగ్ పాయింట్‌ను బ్రేక్ చేసి సెట్‌ను 7-6 (7/3) తేడాతో కైవసం చేసుకున్నాడు.

వివరాలు 

ఫైనల్ సెట్లో అసలైన హోరాహోరి 

ఇక హోరాహోరీగా సాగిన ఐదో సెట్‌లోనూ విజయం ఇరువురిని దోబూచులాడింది. ఇద్దరూ ఒకరిపై మరొకరు పట్టు సాధించే ప్రయత్నంలో పోరాటాన్ని మరింత తీవ్రం చేశారు. అల్కరాస్ రెండు పాయింట్లు ముందుండగా, సినర్ తిరిగి పుంజుకొని మ్యాచ్‌ను టైబ్రేక్‌కు తీసుకెళ్లాడు. కానీ అల్కరాస్ అక్కడ అసమాన నైపుణ్యాన్ని చూపించాడు. వరుసగా పాయింట్లను సాధించి, సినర్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా టైబ్రేక్‌ను 10/2 తేడాతో గెలిచాడు. దీంతో చివరి సెట్‌ను సొంతం చేసుకొని తన రెండో ఫ్రెంచ్ ఓపెన్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం మ్యాచ్ 5 గంటల 29 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగింది.