
US Open: యూఎస్ ఓపెన్ 2025 విజేతగా కార్లోస్ అల్కరాస్
ఈ వార్తాకథనం ఏంటి
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాస్ దక్కించుకున్నాడు. న్యూయార్క్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో అల్కరాస్ 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో ఇటలీ ఆటగాడు యానిక్ సినర్‌ను ఓడించాడు. సుమారు 2 గంటల 42 నిమిషాలు సాగిన ఈ ఉత్కంఠమైన పోటీ ప్రేక్షకులను ఊపిరి బిగపట్టేలా చేసింది. మొదటి సెట్‌ను అల్కరాస్ సులభంగా కైవసం చేసుకున్నాడు. అయితే రెండో సెట్‌లో తడబడటంతో సినర్ తిరిగి పోరాటాన్ని సమం చేశాడు. కానీ మూడో సెట్‌లో అల్కరాస్ దూకుడుగా ఆడి 6-1 తేడాతో సెట్‌ను గెలుచుకున్నాడు. చివరి నాలుగో సెట్‌లో ఇరువురూ హోరాహోరీగా పోటీ పడినా, ఒత్తిడిని అధిగమించిన అల్కరాస్ విజేతగా నిలిచాడు.
Details
మళ్లీ టాప్ ర్యాంకును సొంతం చేసుకున్న అల్కరాస్
ఈ విజయంతో 65 వారాలుగా ప్రపంచ నంబర్ 1 స్థానంలో ఉన్న సినర్‌ను వెనక్కి నెట్టి అల్కరాస్ మళ్లీ టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. అల్కరాస్‌కు ఇది ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్. రెండోసారి యూఎస్ ఓపెన్‌ను గెలుచుకోవడం విశేషం. ఈ ఏడాది జరిగిన మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో కూడా అల్కరాస్, సినర్ ఒకరిపై ఒకరు తలపడ్డారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో అల్కరాస్ విజయం సాధించగా, వింబుల్డన్‌లో సినర్ గెలిచాడు. ఇప్పుడు యూఎస్ ఓపెన్‌తో అల్కరాస్ ఏడాదిలో రెండో గ్రాండ్‌స్లామ్ కైవసం చేసుకున్నాడు.