Magnus Carlsen: మరోసారి భారత గ్రాండ్‌మాస్టర్ చేతిలో ఓడిన కార్ల్సెన్.. ఆగ్రహాన్ని అదుపు చేయలేక..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత ప్రపంచ చెస్‌లో 'ది వన్ అండ్ ఓన్లీ'గా గుర్తింపు పొందిన నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సెన్ మరోసారి తన ఆగ్రహాన్ని అదుపులో పెట్టలేకపోయాడు. దోహాలో జరుగుతున్న ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో, భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన తర్వాత కార్ల్సెన్ టేబుల్‌ను బలంగా గుద్దుతూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఘట్టానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిని 'కార్ల్సెన్ అవుట్‌బర్స్ట్ 2.0'గా కామెంట్ చేస్తున్నారు. ఇదేమీ కొత్తది కాదు. జూన్‌లో నార్వేలో జరిగిన చెస్ టోర్నమెంట్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ గుకేష్ చేతిలో ఓడిన తర్వాత కూడా కార్ల్సెన్ తన అసహనాన్ని బహిరంగంగా చూపించాడు.
Details
అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఎరిగైసి
ఇప్పుడు మరోసారి అదే తరహా ప్రవర్తన వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఫిడే వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో అర్జున్ ఎరిగైసి అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. 11 రౌండ్లు పూర్తయ్యాక 9 పాయింట్లతో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మాక్సిమ్ వాచియర్-లాగ్రావ్‌తో కలిసి సంయుక్త అగ్రస్థానంలో నిలిచాడు. కార్ల్సెన్‌పై తొమ్మిదవ రౌండ్‌లో అద్భుతమైన ఎండ్‌గేమ్ టెక్నిక్‌తో విజయం సాధించిన ఎరిగైసి, 10వ రౌండ్‌లో అబ్దుసత్తోరోవ్‌ను ఓడించి అగ్రస్థానంలో 0.5 పాయింట్ ఆధిక్యం సంపాదించాడు.
Details
మళ్లీ తిరిగి పోటీలోకి వచ్చే అవకాశం
ప్రస్తుత వరల్డ్ నంబర్ వన్ కార్ల్సెన్, ఆదివారం గెలుచుకున్న వరల్డ్ రాపిడ్ టైటిల్‌తో పాటు తన నాల్గవ వరల్డ్ బ్లిట్జ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలో ఉన్నాడు. ఈ రోజు ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉన్నందున, కార్ల్సెన్ తిరిగి పోటీలోకి వచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. అయితే అర్జున్ ఎరిగైసి చేతిలో వచ్చిన ఓటమి అతడిని తీవ్రమైన అసహనంలో ముంచేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
Oops!…He Did It Again#RapidBlitz pic.twitter.com/O5N5CWoO2f
— International Chess Federation (@FIDE_chess) December 29, 2025