LOADING...
Ishan Kishan Century: 42 బంతుల్లో శతకం.. భారత ఫాస్టెస్ట్ సెంచరీల జాబితాలో ఇషాన్ కిషన్ చేరిక
42 బంతుల్లో శతకం.. భారత ఫాస్టెస్ట్ సెంచరీల జాబితాలో ఇషాన్ కిషన్ చేరిక

Ishan Kishan Century: 42 బంతుల్లో శతకం.. భారత ఫాస్టెస్ట్ సెంచరీల జాబితాలో ఇషాన్ కిషన్ చేరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2026
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు ఎప్పటికీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టే ఇలాంటి ఇన్నింగ్స్‌లు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ అరుదైన ఘనతలో తాజాగా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా చేరాడు. శనివారం రాత్రి తిరువనంతపురంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్‌లో కిషన్ 43 బంతుల్లో 103 రన్స్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 6 ఫోర్లు, 10 సిక్స్‌లు కొట్టిన ఈ శతకం కిషన్‌ను భారత టీత20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఐదవ బ్యాటర్‌గా నిలిపింది. భారత ఫాస్టెస్ట్ సెంచరీల జాబితాలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నారు.

Details

35 బంతుల్లో రోహిత్ శతకం

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లో రోహిత్ శతకం పూర్తి చేశాడు. రెండో స్థానంలో యువ ఓపెనర్ అబిషేక్ శర్మ (37 బంతుల్లో శతకం, ఇంగ్లండ్‌), మూడో స్థానంలో సంజూ శాంసన్ (40 బంతుల్లో, బంగ్లాదేశ్), నాలుగో స్థానంలో తిలక్ వర్మ (41 బంతుల్లో, దక్షిణాఫ్రికా) నిలిచారు. ఇప్పటికే ఐదు స్థానాల్లో చేరిన ఇషాన్ కిషన్ 42 బంతుల్లో శతకం సాధించడం ద్వారా భారత క్రికెట్‌లో వేగవంతమైన శతకాలు సాధించిన ఎలైట్ బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానాన్ని సంపాదించాడు. న్యూజీలాండ్‌పై ప్రదర్శనతో కిషన్ తన కెరీర్‌లో మరో మైలురాయిని తాకాడు.

Details

టీ20 వరల్డ్ కప్ జట్టులో ఆడడం ఖాయం

ఈ ప్రదర్శన భారత్‌ టీ20 జట్టు బ్యాటింగ్ లోతు, దూకుడు ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. ఇషాన్ కిషన్ ఫాస్ట్ సెంచరీతో 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరపున ఆడడం ఖాయం అయ్యింది. వరుస వైఫల్యాల కారణంగా సంజూ శాంసన్ తన చోటు గురించి సందేహాలను ఎదుర్కొంటున్నాడు. తిలక్ వర్మ జట్టులోకి వస్తే సంజూ బెంచ్‌లోకి వెళ్లే అవకాశముంది.

Advertisement