NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Ishan Kishan: 47 బంతుల్లో సెంచరీ.. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ (వీడియో)
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ishan Kishan: 47 బంతుల్లో సెంచరీ.. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ (వీడియో)
    47 బంతుల్లో సెంచరీ.. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ (వీడియో)

    Ishan Kishan: 47 బంతుల్లో సెంచరీ.. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ (వీడియో)

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 23, 2025
    06:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సీజన్లు మారినా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) దూకుడు తగ్గడం లేదు. ఐపీఎల్‌ 18వ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ (RR)తో తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసింది.

    దూకుడైన బ్యాటింగ్‌తో ఐపీఎల్‌ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది.

    ఐపీఎల్‌లో ఇప్పటి వరకు అత్యధిక స్కోరు 287/3. ఇది గత సీజన్‌లో ఆర్సీబీపై సన్‌రైజర్స్‌నే నమోదు చేసిన రికార్డు. కానీ ఈసారి ఆ రికార్డును చెరిపివేసే అవకాశాన్ని రెండు పరుగుల తేడాతో కోల్పోయింది.

    Details

    ఇషాన్‌ కిషన్‌ మెరుపు సెంచరీ

    సన్‌రైజర్స్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో చెలరేగాడు. 47 బంతుల్లో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

    అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాది ఆకట్టుకున్నాడు.

    హెడ్‌, నితీశ్‌, క్లాసెన్‌ విధ్వంసం

    ట్రావిస్‌ హెడ్‌ కూడా విధ్వంసమైన బ్యాటింగ్‌తో రాణించాడు. 31 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ 11 బంతుల్లో 24 పరుగులు (5 ఫోర్లు) చేశాడు.

    Details

    రాణించిన నితీశ్ రెడ్డి

    తెలుగుతేజం నితీశ్‌ రెడ్డి 15 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌ ఉన్నాయి. హెన్రిచ్‌ క్లాసెన్‌ 14 బంతుల్లో 34 పరుగులు చేయగా, అతని స్కోరులో 5 ఫోర్లు, 1 సిక్స్‌ ఉన్నాయి.

    రాజస్థాన్‌ బౌలర్లలో తుషార్‌ దేశ్‌ పాండే 3 వికెట్లు తీశాడు. మహీశ్‌ తీక్షణ 2 వికెట్లు పడగొట్టగా, సందీప్‌ శర్మకు 1 వికెట్‌ లభించింది. స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ విఫలమయ్యాడు.

    4 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఆర్చర్‌ బౌలింగ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఇషాన్ కిషాన్ సూపర్ సెంచరీ

    𝙏𝙝𝙖𝙩 𝙢𝙖𝙞𝙙𝙚𝙣 #TATAIPL 𝙘𝙚𝙣𝙩𝙪𝙧𝙮 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜 🧡

    A special first for Ishan Kishan as he brought up his 💯 off just 45 balls 🔥

    Updates ▶️ https://t.co/ltVZAvInEG#SRHvRR | @SunRisers | @ishankishan51 pic.twitter.com/8n92H58XbK

    — IndianPremierLeague (@IPL) March 23, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇషాన్ కిషన్
    సన్ రైజర్స్ హైదరాబాద్

    తాజా

    Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్ భారతదేశం
    PM Modi: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. త్రివిధ దళాధిపతులతో మోదీ అత్యవసర సమీక్ష నరేంద్ర మోదీ
    Bomb threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు బాంబు బెదిరింపు
    Red Cross Symbol: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ఆస్పత్రులపై 'రెడ్ క్రాస్' గుర్తులు తెలంగాణ

    ఇషాన్ కిషన్

    బర్త్‌డే బాయ్‌ని స్పెషల్ గిప్ట్ ఆడిగిన రోహిత్ శర్మ.. ఇషాన్ కిషన్ ఏం చెప్పారంటే? రోహిత్ శర్మ
    చితకబాదిన ఇషాన్ కిషన్.. ధోని రికార్డు బద్దలు టీమిండియా
    Ishan Kishan: 'బజ్‌బాల్' క్రికెట్‌పై ఇషాన్ కిషన్ ఏమన్నారంటే? రోహిత్ శర్మ
    IND Vs WI: హాఫ్ సెంచరీతో విజృంభించిన ఇషాన్ కిషన్.. భారత్ ఘన విజయం టీమిండియా

    సన్ రైజర్స్ హైదరాబాద్

    IPL 2023: ఈడెన్ గార్డన్స్ లో సన్ రైజర్స్ సూపర్ విక్టరీ ఐపీఎల్
    IPL 2023: సన్ రైజర్స్ VS ముంబై ఇండియన్స్.. గెలుపుపై ఇరు జట్లు ధీమా ఐపీఎల్
    ముంబై విజయంతో.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో స్పల్ప మార్పులు! ఐపీఎల్
    IPL 2023: సన్ రైజర్స్, చైన్నైలోని కీలక ఆటగాళ్లు వీరే! చైన్నై సూపర్ కింగ్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025