Satadru Datta: కోల్‌కతా స్టేడియంలో గందరగోళం.. ఈవెంట్ మేనేజర్ సతద్రు దత్తా అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
శనివారం మధ్యాహ్నం కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీని సత్కరించే కార్యక్రమంలో భారీ గందరగోళం చోటుచేసుకుంది. ఈ ఈవెంట్‌లో మెస్సీని చూడటానికి వేలాది మంది అభిమానులు స్టేడియంలో గుమిగూడగా, వారి ఉత్సాహం నియంత్రించలేకపోయింది. అభిమానులు తమ స్టార్ ఆటగాడిని కనీసం చూడలేకపోవడంతో స్టేడియంలో కుర్చీలు, వాటర్ బాటిల్స్ విసిరి గొడవను సృష్టించారు. ఈ ఘటనలో పలువురు అభిమానులు వ్యాఖ్యానిస్తూ, కేవలం మెస్సీని చూడటానికి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చు చేసి టిక్కెట్లు కొన్నారు, అయినప్పటికీ ఒక్కసారి కూడా మెస్సీని చూడలేకపోయినట్లు పేర్కొన్నారు.
Details
కేసు నమోదు చేసినట్లు సమచారం
ఈ గందరగోళం తర్వాత ఈవెంట్ నిర్వాహకుడు సతద్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు అని లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ (ADG) జావేద్ షమీమ్ తెలిపారు. ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయబడినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉందని, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు. 14 ఏళ్ల తర్వాత మెస్సీ భారతదేశానికి తిరిగి పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఫుట్‌బాల్ స్టార్ "గోట్ ఇండియా టూర్ 2025"లో భాగంగా పలు రాష్ట్రాలను సందర్శిస్తున్నారు. పశ్చిమబెంగాల్ ఈ టూర్‌లో ఆయన మొదట ఎంచుకున్న రాష్ట్రం, ఇక్కడే అభిమానుల గందరగోళం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Details
ఇండియాలో ఈవెంట్
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సతద్రు దత్తా "E SataDru Datta Initiative" బ్యానర్ కింద పని చేస్తున్నారు. ఆయన గతంలో పీలే, డియెగో మారడోనా, కాఫు వంటి ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలతో భారతదేశంలో ఈవెంట్‌లు నిర్వహించారు. కోల్‌కతా తర్వాత, లియోనెల్ మెస్సీ హైదరాబాదు, ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించనున్నారు, తద్వారా "గోట్ ఇండియా టూర్ 2025" మొత్తం దేశవ్యాప్తంగా సత్తా చాటనుంది