
IND vs WI: టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యం.. 390 పరుగులకు విండీస్ ఆలౌట్
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్-టీమిండియా రెండో టెస్టు మ్యాచ్‌లో 121 పరుగుల లక్ష్యాన్ని విండీస్ నిర్దేశించింది. 270 పరుగులతో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో జాన్ కాంప్‌బెల్ 199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 115 పరుగులు చేసి శతకం కొట్టాడు . షై హోప్ 214 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు సాధించాడు. జస్టిన్ గ్రీవ్స్ 50 నాటౌట్, రోస్టన్ ఛేజ్ 40 పరుగులతో రాణించారు. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీశారు. ఇషాంత్ సిరాజ్ రెండు వికెట్లు పొందాడు. రవీంద్ర జడేజా, సుందర్ ఒక్కో వికెట్‌ను తీశారు.
Details
చివరి వికెట్ 79 పరుగుల భాగస్వామ్యం
రెండో ఇన్నింగ్స్‌లో చివరి వికెట్‌కు 79 పరుగుల కీలక భాగస్వామ్యం ఏర్పడింది. 311 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన విండీస్ 41 పరుగుల ఆధిక్యంతో ఉండగా, జస్టిన్ గ్రీవ్స్, జేడెన్ సీల్స్ 32 పరుగులతో జోడీగా నిలిచి చివరి వికెట్ భాగస్వామ్యాన్ని 79 పరుగుల వరకు తీసుకెళ్లారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 175, శుభ్మన్ గిల్ 129 నాటౌట్‌తో శతకాలు కొట్టి 518/5 స్కోరుతో డిక్లేర్ చేసింది. ఆ తర్వాత విండీస్ 81.5 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంగా 270 పరుగులు లభించాయి. ఫాలో ఆన్‌లో బరిలోకి దిగిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకే కుప్పకూలింది.