LOADING...
Viral Video: చీర్ లీడర్లపై అసభ్య ప్రవర్తన.. స్టేడియంలో కలకలం
చీర్ లీడర్లపై అసభ్య ప్రవర్తన.. స్టేడియంలో కలకలం

Viral Video: చీర్ లీడర్లపై అసభ్య ప్రవర్తన.. స్టేడియంలో కలకలం

వ్రాసిన వారు Moogati Shabari
May 24, 2026
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన లక్నో సూపర్జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఒకవైపు పంజాబ్ జట్టు అద్భుత విజయంతో ఆకట్టుకోగా, మరోవైపు స్టేడియంలో చోటుచేసుకున్న ఒక అవాంఛనీయ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. లక్నో వేదికగా జరిగిన ఈ పోరులో కొందరు ప్రేక్షకులు హద్దులు దాటి ప్రవర్తిస్తూ చీర్ లీడర్లను వేధించడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది.

వివరాలు

కరెన్సీ నోటుపై ఫోన్ నెంబర్ రాసి విసిరిన వ్యక్తి..

మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న సమయంలో, లక్నో జట్టుకు మద్దతుగా ఉన్న చీర్ లీడర్ల సీటింగ్ ప్రాంతం వెనుక కూర్చున్న కొందరు ప్రేక్షకులు అసభ్య వ్యాఖ్యలు చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మరింత దారుణంగా ప్రవర్తించాడు. తన ఫోన్ నెంబర్‌ను కరెన్సీ నోటుపై రాసి, ఆ నోటును మడిచి ఒక చీర్ లీడర్ వైపు విసిరాడు. ఆ నోటు నేరుగా ఆమెకు తగలడంతో ఆమె తీవ్ర అసహనానికి, షాక్‌కు గురైంది.

వివరాలు

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

ఈ ఘటనపై చీర్ లీడర్ ధైర్యంగా స్పందించింది. తనపైకి విసిరిన కరెన్సీ నోటును సేకరించి, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు అందజేసింది. తనను వేధించిన వ్యక్తిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరిస్థితిని వెంటనే గుర్తించిన పోలీసులు, ఫోన్ నెంబర్ రాసి నోటు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో నెటిజన్లు, క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "క్రికెట్‌ను ఆస్వాదించేందుకు స్టేడియానికి వెళ్లాలి గానీ, ఇలాంటి అసభ్య ప్రవర్తనతో దేశ ప్రతిష్టను దెబ్బతీయకూడదు" అంటూ పలువురు మండిపడుతున్నారు. స్టేడియాల్లో మహిళలు, చీర్ లీడర్ల భద్రత కోసం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

Advertisement