
RCB vs CSK: ఆర్సీబీ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
చైన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచులో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ 17 ఏళ్ల తర్వాత ఘన విజయం సాధించింది.
2008లో జరిగిన తొలి సీజన్ లో ఈ మైదానంలో విజయాన్ని సాధించిన ఆర్సీబీ, ఆ తర్వాత జరిగిన ఎనిమిది మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది.
ఇవాళ చైన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ 50 పరుగులు తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 196 పరుగుల భారీ స్కోరు చేధించింది.
లక్ష్య చేధనలో చైన్నై 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులను మాత్రమే చేసింది.
Details
నిరాశ పరిచిన చైన్నై బ్యాటర్లు
రచిన్ రవీంద్ర 41 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (0), రాహుల్ త్రిపాఠి(5), దీపక్ హుడా (4), సామ్ కర్రన్ (8) నిరాశ పరిచారు.
చివర్లో ఎంఎస్ ధోని 16 బంతుల్లో (3 ఫోర్లు, 2 సిక్సర్ల) 30 పరుగులు చేశాడు.
ఆర్సీబీ బౌలర్లలో జోష్ హెజిల్‌వుడ్, యాష్ దియాల్, లివింగ్ స్టోన్ తలా రెండు వికెట్లు తీశారు.
ఇక కెప్టెన్ రజిత్ పటిదార్ (51), పిలిప్ సాల్ట్ (32), కోహ్లీ (31) రాణించారు.
ఇప్పటివరకూ ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
50 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం
Match 8. Royal Challengers Bengaluru Won by 50 Run(s) https://t.co/I7maHMvZOk #CSKvRCB #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) March 28, 2025