Page Loader
ఛతేశ్వర్ పుజారా సన్సేషనల్ రికార్డు
ఛతేశ్వర్ పుజారా

ఛతేశ్వర్ పుజారా సన్సేషనల్ రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 23, 2022
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా క్రికెటర్‌ చెతేశ్వర్‌ పుజారా టెస్టుల్లో మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన 8వ ఇండియన్‌ క్రికెటర్‌గా పుజారా నిలిచాడు. రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు పుజారా ఈ రికార్డుకు 16 పరుగుల దూరంలో ఉన్నాడు. రెండో రోజు ఉదయం 24 పరుగులు చేసి.. ఈ ఘనతను సాధించాడు. పుజారాకు ముందు సచిన్‌, ద్రవిడ్, గవాస్కర్‌, లక్ష్మణ్‌, సెహ్వాగ్‌, కోహ్లి, గంగూలీలు టెస్టుల్లో 7 వేల కంటే ఎక్కువ రన్స్‌ చేశారు. 2010లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన పుజారా చేసిన పుజారా.. ప్రస్తుతం టెస్టు ర్యాకింగ్ లో మూడో స్థానంలో నిలిచాడు.

పుజారా

ఈ ఏడాది ఫుల్ ఫామ్‌లో ఉన్న పుజారా

మునపటి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 102 పరుగులు చేశాడు. 98 ఇన్నింగ్స్‌లో 7 వేల పరుగులు పూర్తి చేసి.. శబాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో 44.64 సగటుతో 7,008 పరుగులను కలిగి ఉన్నాడు. ఇందులో 19 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఇండియన్‌ టీమ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి నయా వాల్‌గా ఒకప్పటి రాహుల్‌ ద్రవిడ్‌ స్థానాన్ని భర్తీ చేసిన పుజారా.. గతేడాది ఫామ్‌ కోల్పోయాడు. ఈ ఏడాది మొదట్లో అతన్ని టీమ్‌లో నుంచి తొలగించారు.అయితే కౌంటీ క్రికెట్లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన పుజారా తిరిగి ఇండియన్‌ టీమ్‌లోకి వచ్చాడు. ఒకే టెస్టు ఇన్నింగ్స్‌లో 500 కన్నా ఎక్కువ బంతులను ఎదుర్కొన్న మొదటి అటగాడ