Loading...
FIFA: స్పెయిన్‌ ఆటగాళ్లతో ఘర్షణ.. అర్జెంటీనా ఆటగాళ్లపై ఫిఫా దర్యాప్తు
స్పెయిన్‌ ఆటగాళ్లతో ఘర్షణ.. అర్జెంటీనా ఆటగాళ్లపై ఫిఫా దర్యాప్తు

FIFA: స్పెయిన్‌ ఆటగాళ్లతో ఘర్షణ.. అర్జెంటీనా ఆటగాళ్లపై ఫిఫా దర్యాప్తు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2026
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన అనంతరం మైదానంలో అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కలకలం రేపింది. ఈ ఘటనను ఫిఫా తీవ్రంగా పరిగణించింది. ఎఫ్‌డీసీ (ఫిఫా క్రమశిక్షణా నియమావళి) నిబంధనలు ఉల్లంఘించిన ఆటగాళ్లపై విచారణ చేపట్టేందుకు క్రమశిక్షణా, ఎథిక్స్ ప్రాసిక్యూటర్‌ను నియమించినట్లు ఫిఫా అధికారికంగా ప్రకటించింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని సంస్థ తెలిపింది. వరుసగా రెండోసారి ప్రపంచకప్ విజేతగా నిలవాలన్న డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆశలకు స్పెయిన్ చెక్ పెట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 1-0 తేడాతో విజయం సాధించిన స్పెయిన్ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

వివరాలు

ఆగ్రహంతో స్పందించిన లియాండ్రో పరెడెస్

మ్యాచ్ ముగిసిన తర్వాత స్పెయిన్ ఆటగాళ్లు విజయోత్సాహంలో సంబరాలు జరుపుకుంటుండగా, అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్ ఆగ్రహంతో స్పందించాడు.

అతడు స్పెయిన్ ఆటగాళ్లు ఎరిక్ గార్సియా, గావి వద్దకు వెళ్లి దూకుడుగా ప్రవర్తించినట్లు సమాచారం. అంతేకాకుండా వారిపై అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు వారిని కొట్టేందుకు కూడా ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఫిఫా అధికారిక దర్యాప్తు ప్రారంభించింది.

విచారణలో వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫుట్‌బాల్ ప్రపంచం మొత్తం ఫిఫా దర్యాప్తు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ADVERTISEMENT