LOADING...
Usain Bolt: మెట్లు ఎక్కితే అలసట వస్తోంది : ఉసేన్ బోల్ట్
మెట్లు ఎక్కితే అలసట వస్తోంది : ఉసేన్ బోల్ట్

Usain Bolt: మెట్లు ఎక్కితే అలసట వస్తోంది : ఉసేన్ బోల్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2025
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

గతంలో ట్రాక్‌పై చిరుతలా పరుగెత్తి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులుగా చేసిన ఉసేన్ బోల్ట్‌, ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తిన వ్యక్తిగా (World's Fastest Man) గుర్తింపు పొందిన ఈ జమైకా స్ప్రింటర్, ప్రస్తుతం మెట్లు ఎక్కడం కష్టంగా ఉన్నందున రన్నింగ్‌లో తిరిగి ప్రవేశించాలనుకుంటున్నట్టు తెలిపారు. టోక్యోలో జరుగుతున్న వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ను వీక్షించేందుకు వచ్చిన బోల్ట్, ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రోజువారీ జీవితం, శారీరక కార్యకలాపాల గురించి వివరించాడు. ఆయన చెప్పినట్లే, "పిల్లలు స్కూల్‌కు వెళ్లే సమయానికి నిద్రలో ఉంటాను. కొన్నిసార్లు మంచి మూడ్‌లో ఉంటే వర్క్‌ఔట్‌ చేస్తాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తరువాత ఇంట్లోనే సిరీస్‌ చూస్తూ కూర్చుంటాను.

Details

మళ్లీ రన్నింగ్ ప్రారంభించాలి

ఆ తర్వాత పిల్లలతో కొద్దిసేపు కాలక్షేపం చేస్తాను. జిమ్‌ అంతగా ఇష్టం లేనప్పటికీ చేస్తుంటాను. కొంతకాలంగా దీనికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు రన్నింగ్‌ మొదలుపెట్టాలి, ఎందుకంటే మెట్లు ఎక్కేటప్పుడు అయాసం అనిపిస్తోంది. తిరిగి రన్నింగ్‌ ప్రారంభిస్తే, శ్వాస సరిగ్గా తీసుకోవడం మెరుగుపడుతుందని బోల్ట్‌ వివరించాడు. జమైకా వంశానికి చెందిన ఈ దిగ్గజ స్ప్రింటర్‌ ఎనిమిది సార్లు ఒలింపిక్స్‌ బంగారు పతకాలు గెలుచుకున్నాడు. 100 మీటర్లు, 200 మీటర్లు, 4x100 మీటర్ల రేసుల్లో ప్రపంచ రికార్డులను స్థాపించిన బోల్ట్‌ 2017లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 11 సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఈ పరుగుల రాజా రికార్డులను తాకగలిగే ప్రత్యర్థులు ప్రస్తుతం లేమని గమనించదగ్గ విషయం.