LOADING...
Hardik Pandya : వరల్డ్‌కప్ ముందు వివాదం.. బీసీసీఐ రూల్స్‌కు చెక్ పెట్టి గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్?
వరల్డ్‌కప్ ముందు వివాదం.. బీసీసీఐ రూల్స్‌కు చెక్ పెట్టి గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్?

Hardik Pandya : వరల్డ్‌కప్ ముందు వివాదం.. బీసీసీఐ రూల్స్‌కు చెక్ పెట్టి గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 14, 2026
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆటలో కాదు. అలాగే బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలే చర్చనీయాంశమయ్యాయి. ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరగబోయే హై వోల్టేజ్ మ్యాచ్ కోసం భారత జట్టు కొలంబో చేరుకుంది. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. ఇదే సమయంలో హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మతో కలిసి రావడం పెద్ద దుమారానికి దారితీసింది.దాయాదుల పోరు సమీపిస్తుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి కీలక సమయంలో హార్దిక్ పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి టీమ్ బస్సులో, హోటల్‌లో కనిపించడంపై సోషల్ మీడియాలో చర్చలు మిన్నంటాయి. మిగతా ఆటగాళ్లు ఒంటరిగా వచ్చారు, హార్దిక్ మాత్రం గర్ల్‌ఫ్రెండ్‌తో రావడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Details

నిబంధనలను విరుద్ధమని విమర్శలు

ఇది బీసీసీఐ అధికారిక నిబంధనలకు విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా బీసీసీఐ ఐసీసీ టోర్నీలు లేదా విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్లు కుటుంబ సభ్యులు లేదా భాగస్వాములను వెంట తీసుకురావడంపై కఠిన నియమాలు అమలు చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం టీ20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా ఆటగాళ్లు తమ భార్యలు లేదా గర్ల్‌ఫ్రెండ్స్‌ను వెంట తీసుకురావడానికి బోర్డు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ఆటపై ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే హార్దిక్ అధికారిక టీమ్ ట్రావెల్‌లో మాహికాను వెంట తీసుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Details

వీడియో వైరల్

కొలంబో ఎయిర్‌పోర్ట్‌లో అర్ష్‌దీప్ సింగ్ స్థానిక డాన్సర్లతో కలిసి చిందేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అదే వీడియోలో హార్దిక్-మాహికా జంట కూడా కెమెరాకు చిక్కింది. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. "హార్దిక్‌కు బీసీసీఐ రూల్స్ వర్తించవా?" అని ఒక నెటిజన్ ప్రశ్నిస్తే, "టీమ్ బస్సులో గర్ల్‌ఫ్రెండ్‌కు చోటు ఎలా ఇచ్చారని మరొకరు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం 45 రోజుల కంటే ఎక్కువ కాలం పర్యటన ఉంటేనే కుటుంబ సభ్యులకు 14 రోజుల పాటు అనుమతి ఉంటుంది. కానీ ప్రస్తుత సందర్భంలో హార్దిక్ వ్యవహారం బోర్డు రూల్స్‌కు విరుద్ధంగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Details

బోర్డు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి

కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉంటున్నారనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో హార్దిక్ వ్యవహారాన్ని గంభీర్, అలాగే బీసీసీఐ ఎలా చూస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్ ముందు ఇలాంటి వివాదాలు జట్టు వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయేమోనన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. గతంలోనూ వ్యక్తిగత కారణాలతో వార్తల్లో నిలిచిన హార్దిక్, వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై బోర్డు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement