Shubman Gill : మ్యాగీ కంటే వేగంగా గిల్ ఎగ్జిట్.. అభిమానుల ఫైర్!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా యువ స్టార్ బ్యాట్స్‌మన్ శుభమన్ గిల్ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను నిరాశకు గురిచేశాడు. మంగళవారం కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అతడు పూర్తిగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్న గిల్, ఒక ఫోర్ బాదిన వెంటనే ఔట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడీ వేసిన బంతికి మార్కో జాన్సెన్ క్యాచ్ పట్టుకోవడంతో గిల్ పెవిలియన్ చేరుకున్నాడు. ఈ ప్రదర్శనతో సోషల్ మీడియా వేదికగా గిల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "ఇంత త్వరగా మ్యాగీ కూడా రెడీ కాదు" అంటూ సెటైర్లు వేస్తున్న నెటిజన్లతో పాటు, సంజూ శాంసన్‌ను కావాలనే పక్కన పెడుతున్నారని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
సంజూ కోసం డిమాండ్
రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అంతర్జాతీయ టీ20ల్లో శుభ్‌మన్ గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. గత ఏడాది పాటు రెగ్యులర్ ఓపెనర్‌గా మంచి ప్రదర్శన చేసిన సంజు శాంసన్‌ను పక్కన పెట్టి గిల్‌ను ఓపెనింగ్‌కు పంపిస్తున్నారు. అయితే అతనికి బాగా సరిపోయే ఆ స్థానంలో గిల్ నుంచి భారీ ఇన్నింగ్స్ రావడంలేదు. ఇదే సమయంలో గిల్ జట్టులోకి రావడంతో సంజూ శాంసన్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తున్నారు. మూడో స్థానం నుంచి ఎనిమిదోస్థానం వరకు వివిధ స్థానాల్లో అవకాశం ఇచ్చినా, అక్కడ అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దాంతో తుది జట్టులో చోటు దక్కడం కూడా కష్టమవుతోంది.గిల్ వరుసగా విఫలమవుతుండటంతో, సంజూను మళ్లీ తుది జట్టులోకి తీసుకుని ఓపెనర్‌గా పంపాలన్న డిమాండ్లు అభిమానుల్లో పెరుగుతున్నాయి.
వివరాలు
20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసిన భారత్
ఇక మ్యాచ్ వివరాల్లోకి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా కేవలం 28 బంతుల్లోనే ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు బలమైన స్కోరు అందించాడు. తిలక్ వర్మ (26), అక్షర్ పటేల్ (23)లు కూడా కొంతమేర సహకారం అందించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడీ మూడు వికెట్లు సాధించగా, లుథో సిపాంలా రెండు వికెట్లు పడగొట్టాడు. డోనోవన్ ఫెర్రీరా ఒక వికెట్ తీసుకున్నాడు.
వివరాలు
12.3 ఓవర్లలోనే 74 పరుగులకే అలౌటైనా దక్షిణాఫ్రికా
176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ భారత బౌలర్ల ముందు పూర్తిగా కుప్పకూలింది. కేవలం 12.3 ఓవర్లలోనే 74 పరుగులకే ఆలౌటైంది. దాంతో భారత్ 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్ (22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీసుకోగా, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఒక్కో వికెట్ సాధించారు.