Corbin Bosch: ముంబై ఇండియన్స్ ప్లేయర్‌కు పీసీబీ నోటీసులు.. పాకిస్తాన్ సూపర్ లీగ్ కాకుండా ఐపీఎల్ ఆడటమే కారణం
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఆడుతున్న ఓ క్రికెటర్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లీగల్ నోటీసు జారీ చేసింది.
ఈ ఏడాది ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఆ ఆటగాడికి నోటీసులు అందడంతో, ప్రస్తుతం అతను పీసీబీతో సంప్రదింపులు జరుపుతున్నాడు.
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లిజార్డ్ విలియమ్స్ స్థానంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఈ ఆటగాడిని రీప్లేస్ చేసింది.
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బోష్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లీగల్ నోటీసు పంపింది.
ఈ ఏడాది పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో అరంగేట్రం చేసిన బోష్,రాణించడంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో ఆడే అవకాశం పొందాడు.
వివరాలు
బోష్ కు పీసీబీ లీగల్ నోటీసులు
పీఎస్ఎల్ వేలంలో పెషావర్ జల్మి ఫ్రాంఛైజీ కార్బిన్ బోష్‌ను తమ జట్టులోకి ఎంపిక చేసుకుంది.
అయితే, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు లిజార్డ్ విలియమ్స్ గాయపడటంతో, అతని స్థానంలో బోష్‌ను ముంబై ఫ్రాంఛైజీ తీసుకుంది.
పీఎస్ఎల్ లో ఆడేందుకు అంగీకరించిన బోష్,ఇప్పుడు ఐపీఎల్ ఛాన్స్ రావడంతో అక్కడికి వెళ్లడం పీసీబీకి కోపం తెప్పించింది.
సాధారణంగా,ఐపీఎల్ కంటే ముందే పీఎస్ఎల్ నిర్వహించబడుతుంది.అయితే, ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ వేదికగా జరగనున్న కారణంగా పీఎస్ఎల్ ఆలస్యమైంది.
ఐపీఎల్ ప్రారంభమైన రెండు వారాల తర్వాతే పీఎస్ఎల్ మొదలవ్వనుంది.
ఈ పరిస్థితుల్లో, పీఎస్ఎల్‌కు దూరంగా ఉంటూ ఐపీఎల్‌ను కొనసాగించేందుకు బోష్ నిర్ణయం తీసుకున్నాడు. దీనిపై పీసీబీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ అతనికి లీగల్ నోటీసులు జారీ చేసింది.
వివరాలు
నోకియా స్థానంలో రీప్లేస్‌మెంట్‌గా బోష్
"మా ఏజెంట్ ద్వారా ప్లేయర్‌కు నోటీసులు పంపాం. పీఎస్ఎల్ నుంచి ఎందుకు తప్పుకున్నాడో వివరణ కోరాం. కాంట్రాక్ట్‌ను ఎందుకు ఉల్లంఘించాడో చెప్పాల్సిందిగా డిమాండ్ చేశాం. దీనిపై ప్రస్తుతం మేము మరే విధమైన వ్యాఖ్యలు చేయడం లేదు" అని పీసీబీ అధికార వర్గాలు తెలిపాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొనబోయే దక్షిణాఫ్రికా జట్టు 15 మంది సభ్యుల జాబితాలో బోష్ కూడా ఉన్నాడు.
నోకియా స్థానంలో రీప్లేస్‌మెంట్‌గా బోష్ ఎంపికయ్యాడు. ఇప్పటివరకు కేవలం ఒక టెస్టు, రెండు వన్డేలు మాత్రమే ఆడిన బోష్, 86 టీ20 మ్యాచ్‌ల అనుభవం కలిగిన ఆటగాడిగా నిలిచాడు.