
క్రికెట్: అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న టీమిండియా
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల ఆసియా కప్ అందుకున్న జోష్ లో ఉన్న భారత క్రికెట్ జట్టు, అదే రకమైన అద్భుత ప్రదర్శనతో ముందుకు సాగుతోంది.
మొహాలీ వేదికగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఐదు వికెట్ల తేడాతో జయకేతనాన్ని ఎగరవేసింది.
అయితే వన్డేల్లో సూపర్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతున్న భారత జట్టు, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
115పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్న పాకిస్తాన్ ని వెనక్కి నెట్టి 116పాయింట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
దీంతో ఒకే కాలంలో టెస్టు, వన్డే, టీ20ఫార్మాట్లలో మొదటి స్థానంలో ఉన్న జట్టుగా అవతరించింది.
2012లో దక్షిణాఫ్రికా కూడా అన్ని ఫార్మాట్లలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆ ఘనత టీమిండియాకు దక్కింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీసీసీఐ ట్వీట్
No. 1 Test team ☑️
— BCCI (@BCCI) September 22, 2023
No. 1 ODI team ☑️
No. 1 T20I team ☑️#TeamIndia reigns supreme across all formats 👏👏 pic.twitter.com/rB5rUqK8iH