LOADING...
SA vs Ban: చితకబాదుకున్న క్రికెటర్లు.. ఢాకా టెస్టులో గందరగోళం.. వీడియో హల్‌చల్
చితకబాదుకున్న క్రికెటర్లు.. ఢాకా టెస్టులో గందరగోళం.. వీడియో హల్‌చల్

SA vs Ban: చితకబాదుకున్న క్రికెటర్లు.. ఢాకా టెస్టులో గందరగోళం.. వీడియో హల్‌చల్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌ను 'జెంటిల్‌మెన్స్ గేమ్‌' అని పేరు పెట్టినప్పటికీ, అప్పుడప్పుడూ ఆ మాటకు మచ్చ కలిగించే ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి ఘటన మే 28న బంగ్లాదేశ్‌లోని ఢాకాలో చోటు చేసుకుంది. ఎమర్జింగ్ జట్ల మధ్య జరిగిన నాలుగు రోజుల అనధికారిక టెస్టులో బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మైదానంలోనే తోసుకుంటూ, కొట్టుకొనే స్థాయిలో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఢాకాలో జరుగుతున్న మ్యాచ్‌ సందర్భంగా బంగ్లాదేశ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 105వ ఓవర్‌ సమయంలో ఈ ఉద్రిక్తత తలెత్తింది. దక్షిణాఫ్రికా ఆటగాడు, ఆఫ్ స్పిన్నర్ త్సెపో న్టులి బౌలింగ్ చేస్తున్న సమయంలో, బంగ్లాదేశ్ బ్యాటర్ రిపాన్ మోండోల్ అతని బంతిని మిడ్‌వికెట్‌పైకి సిక్సర్ కొట్టాడు.

Details

విచారణ ప్రారంభించిన అధికారులు

ఈక్రమంలో కోపానికి గురైన న్టులి, బ్యాటర్ వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. దీంతో రిపాన్ స్పందనగా అతన్ని వెనక్కి నెట్టాడు. ఆగ్రహంతో ఉన్న న్టులి కూడా రిపాన్‌ను గట్టిగా తోసి, అతని హెల్మెట్ గ్రిల్‌ను పట్టుకుని దాడికి దిగాడు. ఈ ఘర్షణ పెరిగే ముందు అంపైర్‌తో పాటు దక్షిణాఫ్రికా ఫీల్డర్లు మధ్యలోకి వచ్చి ఇద్దరినీ విడదీశారు. ఈ ఘటనపై మ్యాచ్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఐసీసీ ప్రోటోకాల్స్ ప్రకారం ఇరు జట్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఘటన అనంతరం మైదానంలో వాతావరణం తీవ్ర ఉద్రిక్తతతో నిండిపోయింది. బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 371 పరుగులకు ముగించింది. ఆట తిరిగి ప్రారంభమైనా, ఆటగాళ్ల మధ్య ఉద్విగ్నత కొనసాగినట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కొట్టుకున్న ప్లేయర్స్