LOADING...
Cristiano Ronaldo: నేను రాకముందు పోర్చుగల్‌కు ఒక్క టైటిల్ కూడా లేదు: రొనాల్డో
నేను రాకముందు పోర్చుగల్‌కు ఒక్క టైటిల్ కూడా లేదు: రొనాల్డో

Cristiano Ronaldo: నేను రాకముందు పోర్చుగల్‌కు ఒక్క టైటిల్ కూడా లేదు: రొనాల్డో

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
08:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫిఫా ప్రపంచకప్-2026లో పోర్చుగల్ జట్టు ప్రయాణం ముగిసింది. రౌండ్ ఆఫ్-16లో స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓటమి చవిచూడడంతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పటికే ఇదే తన కెరీర్‌లో చివరి ప్రపంచ కప్ అని ప్రకటించిన స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో, ప్రపంచ కప్ కెరీర్‌ను ఓటమితో ముగించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలోనే భావోద్వేగానికి గురైన ఆయన, తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ కప్ నుంచి ఓటమితో నిష్క్రమించడం బాధ కలిగించిందని రొనాల్డో పేర్కొన్నాడు. జట్టు కోసం చివరి వరకు తన శక్తిమేర పోరాడానని, ఆటగాడిగా చేయాల్సిన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాననే సంతృప్తి ఉందని తెలిపాడు.

వివరాలు 

పోర్చుగల్‌కు మూడు ప్రధాన టైటిళ్లు

ఇదే తన చివరి ప్రపంచ కప్ అన్న విషయం వాస్తవమేనని చెప్పిన ఆయన, ప్రస్తుతం రిటైర్‌మెంట్ ప్రకటించే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. ముందుగా కుటుంబంతో కొంత సమయం గడిపిన తర్వాతే భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని, భావోద్వేగానికి లోనై ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోనని వెల్లడించాడు. తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రస్తావించిన రొనాల్డో, పోర్చుగల్ ఫుట్‌బాల్ చరిత్రలో తాను కీలక పాత్ర పోషించానని పేర్కొన్నాడు. తన రాకకు ముందు పోర్చుగల్ ఒక్క ప్రధాన టైటిల్ కూడా గెలవలేదని, తన కెరీర్‌లో దేశానికి మూడు ప్రతిష్ఠాత్మక టైటిళ్లు అందించడంలో భాగస్వామిగా నిలిచానని చెప్పాడు. 2016లో సాధించిన యూరోపియన్ ఛాంపియన్‌షిప్ తనకు ప్రపంచ కప్‌తో సమానమైన గొప్ప విజయంగా భావిస్తానని తెలిపాడు.

వివరాలు 

మార్టినెజ్ సేవలకు ప్రశంసలు

అలాగే పోర్చుగల్ గెలిచిన రెండు యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిళ్లు కూడా దేశ ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్మరణీయ విజయాలేనని రొనాల్డో పేర్కొన్నాడు. ప్రపంచ కప్ నుంచి పోర్చుగల్ నిష్క్రమించిన అనంతరం ప్రధాన కోచ్ రోబర్టో మార్టినెజ్ తన పదవికి రాజీనామా చేయగా, ఆయన సేవలను రొనాల్డో కొనియాడాడు. మార్టినెజ్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించిందని, ఆయన గొప్ప కోచ్ మాత్రమే కాకుండా అద్భుతమైన వ్యక్తి కూడా అని ప్రశంసించాడు.

Advertisement

వివరాలు 

మార్టినెజ్ సేవలకు ప్రశంసలు

పోర్చుగల్ ఫుట్‌బాల్ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్న రొనాల్డో, ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీ నుంచి నిష్క్రమించడం ఎప్పుడూ బాధాకరమేనని అన్నాడు. తమ జట్టు మంచి ఆటను ప్రదర్శించిందని, ఫలితం ఏ జట్టుకైనా అనుకూలంగా మారే అవకాశం ఉన్న మ్యాచ్ అదేనని వ్యాఖ్యానించాడు. అయితే ఫుట్‌బాల్‌లో ఇలాంటి ఫలితాలు సహజమేనని, ఇప్పుడు ఈ నిరాశను అధిగమించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని రొనాల్డో తెలిపాడు.

Advertisement