Loading...
Cristiano ronaldo : క్రిస్టియానో రొనాల్డో - అర్జెంటీనా టీమ్‌ మధ్య 'ఇన్‌స్టా లైక్‌' వివాదం!
క్రిస్టియానో రొనాల్డో - అర్జెంటీనా టీమ్‌ మధ్య 'ఇన్‌స్టా లైక్‌' వివాదం!

Cristiano ronaldo : క్రిస్టియానో రొనాల్డో - అర్జెంటీనా టీమ్‌ మధ్య 'ఇన్‌స్టా లైక్‌' వివాదం!

వ్రాసిన వారు Moogati Shabari
Jul 22, 2026
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ స్పెయిన్ ఫిఫా ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. తుది పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంతో స్పెయిన్ అంతటా అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఇదే సమయంలో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియాలో చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన ఒక 'లైక్' కొత్త చర్చకు దారితీసింది. టోర్నీలో పోర్చుగల్ నాకౌట్ దశలోనే నిష్క్రమించగా, ఆ జట్టు స్పెయిన్ చేతిలోనే ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఫైనల్‌కు అర్జెంటీనా చేరుకునే క్రమంలో ఫిఫా పక్షపాత ధోరణితో వ్యవహరించిందనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపించాయి. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోకు రొనాల్డో లైక్ చేశాడని కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి.

వివరాలు

ఆ విమర్శలకు రొనాల్డో కూడా మద్దతు..

దీంతో ఫిఫా వ్యవహారంపై వచ్చిన విమర్శలకు రొనాల్డో కూడా మద్దతు తెలిపాడని అతడి అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ ప్రచారంపై జాతీయ మీడియా నిర్వహించిన ఫ్యాక్ట్‌చెక్‌లో భిన్నమైన విషయం వెలుగులోకి వచ్చింది.

రొనాల్డో అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోకు లైక్ చేసిన ఆనవాళ్లు కనిపించలేదని తేలింది.

అయితే దీనికి రెండు అవకాశాలు ఉన్నాయని కూడా విశ్లేషకులు చెబుతున్నారు.

ఒకవేళ రొనాల్డో మొదట లైక్ చేసి తర్వాత దాన్ని తొలగించి ఉండొచ్చు. లేదా వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్ పాతదై ఉండే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నారు.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో మాత్రం రొనాల్డో లైక్ చేసినట్లు కనిపిస్తోంది.

వివరాలు

అర్జెంటీనాపై పక్షపాత ఆరోపణలు ఎందుకు వచ్చాయి?

48 జట్లు పోటీపడిన ఈ ప్రపంచకప్‌లో అర్జెంటీనాకు వ్యతిరేకంగా ఒక్కసారి కూడా వీఏఆర్ (VAR) నిర్ణయం రాలేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

ఈ కారణంగానే మెస్సి నాయకత్వంలోని అర్జెంటీనా జట్టుకు ఫిఫా అనుకూలంగా వ్యవహరించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ముఖ్యంగా రౌండ్ ఆఫ్-16లో ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం వీఏఆర్ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

తమ జట్టు చేసిన గోల్‌ను అనర్హంగా ప్రకటించడం వల్లే ఓటమి ఎదురైందని మ్యాచ్ ముగిసిన తర్వాత ఈజిప్ట్ కెప్టెన్‌తో పాటు ప్రధాన కోచ్ కూడా ఆరోపించారు.

అయితే ఈ విమర్శలను ఫిఫా ఖండిస్తూ, మ్యాచ్‌ల నిర్వహణలో ఎలాంటి పక్షపాతం ప్రదర్శించలేదని స్పష్టం చేసింది.

ADVERTISEMENT