Cristiano Ronaldo: '2026 వరల్డ్ కప్ నా చివరిది'.. క్లారిటీ ఇచ్చిన రొనాల్డో
ఈ వార్తాకథనం ఏంటి
ఫుట్ బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో 2026 ఫిఫా వరల్డ్ కప్ తన కెరీర్‌లో చివరిదని స్పష్టం చేశారు. "2026 వరల్డ్ కప్ ఖచ్చితంగా నా చివరి టోర్నమెంట్ అవుతుంది.నేను మరో ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో ఫుట్‌బాల్‌కి గుడ్‌బై చెబుతాను" అని రొనాల్డో తెలిపారు. 2002లో స్పోర్టింగ్ క్లబ్‌లో టీనేజ్ ఆటగాడిగా ఆరంగేట్రం చేసిన రొనాల్డో, క్లబ్,జాతీయ జట్టుల తరపున మొత్తం 950కి పైగా గోల్స్ సాధించి,ప్రపంచ ఫుట్‌బాల్‌లో సూపర్ రికార్డులు సృష్టించారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో మంగళవారం జరిగిన టూరిజం సమ్మిట్ సందర్భంగా సిఎన్ఎన్ జర్నలిస్టు బెక్కీ ఆండర్సన్‌తో రొనాల్డో మాట్లాడుతూ,"నేను అప్పటికి 41 ఏళ్ల వయసులో ఉంటాను. అంత పెద్ద టోర్నీలో అది సరైన సమయం అనిపిస్తుంది"అని అన్నారు.
వివరాలు
ఐర్లాండ్‌పై విజయం సాధిస్తే పోర్చుగల్ జట్టు కప్‌కి అర్హత
ఆయన రిటైర్మెంట్ గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ,"నేను ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. కానీ నేను త్వరలోనే. ఎందుకంటే నేను ఫుట్‌బాల్‌కి నా సమస్తం అర్పించాను. గత 25 ఏళ్లుగా ఈ ఆటలో ఉన్నాను. క్లబ్ స్థాయిలోనూ,జాతీయ జట్టుతోనూ ఎన్నో రికార్డులు సాధించాను. నేను గర్వంగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను" అని రొనాల్డో అన్నారు. ఐదుసార్లు బాలన్ డి'ఒర్ విజేత అయిన రొనాల్డో,వచ్చే సంవత్సరం తన ఆరో వరల్డ్ కప్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గురువారం ఐర్లాండ్‌పై విజయం సాధిస్తే పోర్చుగల్ జట్టు కప్‌కి అర్హత సాధిస్తుంది. వచ్చే ఏడాది కెనడా,మెక్సికో,అమెరికాల్లో జూన్ 11న 48 జట్లతో ప్రారంభమయ్యే ఈ టోర్నీ ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులకు ప్రత్యేకం.
వివరాలు
మరో రెండు సంవత్సరాల్లో రిటైర్ అవుతాను
"ఇప్పటికీ నేను చురుకుగా ఉన్నాను, గోల్స్ కొడుతున్నాను. జాతీయ జట్టుతోనూ, అల్ నసర్ తరపునా ఆడటం చాలా ఆనందంగా ఉంది. కానీ నిజాయితీగా చెప్పాలంటే మరో సంవత్సరం లేదా రెండు సంవత్సరాల్లోనే నేను ఆట నుంచి తప్పుకుంటాను" అని రొనాల్డో స్కై స్పోర్ట్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక జూన్‌లో ఆయన సౌదీ క్లబ్ అల్ నసర్తో తన ఒప్పందాన్ని రెండు సంవత్సరాలకు పొడిగించారు. దీంతో ఆయన 2027 జూన్ వరకు సౌదీ ప్రొ లీగ్‌లో కొనసాగనున్నారు. ఇప్పటివరకు ఆ జట్టు లీగ్‌లో 8 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో అజేయంగా ఉంది.