ధోని తల్లికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన సీఎస్కే అభిమానులు.. ఎందుకో తెలుసా?
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరి క్రికెట్లరకు అభిమానులుంటే ధోని మాత్రం డై హార్డ్స్ ఫ్యాన్స్ ఉన్నారు. ధోని కనపడగానే అభిమానులు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతుంటారు. ఇదే సమయంలో ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అంటూ వార్తలు బలంగా వినపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైన్నై జట్టు ఎక్కడ మ్యాచ్ జరిగినా అక్కడ అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. ఇక చెపాక్ స్టేడియంలో మ్యాచ్ జరిగే స్టేడియం మొత్తం పసుపు రంగులోకి మారిపోతోంది. తాజాగా చెపాక్ స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చివరి వరకూ ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో చైన్నై ఓటమిపాలైంది.
ఫ్లకార్డుతో ధోని తల్లికి శుభాకాంక్షలు
అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ అభిమాని పట్టుకున్న ప్లకార్డు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ధోని కన్న తల్లికి కృతజ్ఞతలు అంటూ ప్లకార్డు ప్రదర్శించాడు. ధోని తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్స్ దేవకి గారు.. మీరు మాకు ధోనినీ ఇచ్చారంటూ హ్యాపీ మదర్స్ డే అని రాశాడు. దీనిపై ధోని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్లకార్డు ధోని అభిమానులతో పాటు అందరిని కూడా విశేషంగా ఆకట్టుకోవడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికొస్తే చైన్నైపై కోల్ కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.