Page Loader
IPL 2024: మ్యాచ్‌కు ముందు CSKకి బిగ్ షాక్.. టోర్నీ తొలి మ్యాచ్‌ నుండి తప్పుకున్న పతిరణ
టోర్నీ తొలి మ్యాచ్‌ నుండి తప్పుకున్న పతిరణ

IPL 2024: మ్యాచ్‌కు ముందు CSKకి బిగ్ షాక్.. టోర్నీ తొలి మ్యాచ్‌ నుండి తప్పుకున్న పతిరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 21, 2024
03:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

రేపు జరిగే ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో CSK జట్టుకు షాక్ తగిలేలా కనిపిస్తోంది.చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ మతీషా పతిరణ గాయం కారణంగా తొలి మ్యాచ్‌లో ఆడటం లేదని క్రికెట్ వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టి20 సమయంలో గాయపడిన 21ఏళ్ల శ్రీలంక పేసర్,తొలి మ్యాచ్‌లో ఆడటం లేదని క్రికెట్ వర్గాలు తెలిపాయి. మీడియా నివేదికల ప్రకారం,గాయం కారణంగా కొన్ని రోజులుగా రెస్ట్ తీసుకుంటున్న పతిరణకు శ్రీలంక క్రికెట్ బోర్డు IPL ప్రారంభ మ్యాచ్‌కు వెళ్లేందుకు ఇంకా NOC జారీ చేయలేదని సమాచారం. ఇప్పటికే,బొటనవేలు గాయం కారణంగా కనీసం మే వరకు డెవాన్ కాన్వే లేకుండా ఆడాల్సి వస్తున్న CSK కి ఇది భారీ దెబ్బ.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టోర్నీ తొలి మ్యాచ్‌ నుండి తప్పుకున్న పతిరణ