Page Loader
సంచలన నిజాన్ని బయటపెట్టిన జాకుబ్ జాంక్టో

సంచలన నిజాన్ని బయటపెట్టిన జాకుబ్ జాంక్టో

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 14, 2023
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

చెక్ ఇంటర్నేషనల్ మిడ్ ఫీల్డర్, ఫుట్‌బాల్ ఆటగాడు జాకుబ్ జాంక్టో ఓ సంచనల నిజాన్నిబయటపెట్టారు . తనపై వస్తున్న ఆరోపణలపై తాజా ఓ కీలక విషయాన్ని బయటపడ్డారు. తాను స్వలింగ సంపర్కుడిని తన ట్విటర్ ఖాతా ద్వారా సోమవారం జాకుబ్ జాంక్టో వెల్లడించారు. ఈ విషయాన్ని ఇక దాచుకోవాల్సిన అవసరం లేదని, బహిరంగంగా ఈ విషయాన్ని అందరూ తెలియాలని ఓ వీడియో ద్వారా తన సందేశాన్ని బయటపెట్టాడు. ఇక నుంచి స్వేచ్ఛగా, తన జీవితాన్ని గడాపాలని జాంక్టో ఆకాంక్షించాడు. భయం, పక్షపాతం, హింస లేకుండా ప్రేమగా జీవించాలని ఉందని తెలియజేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్విట్టర్ ద్వారా తాను స్వలింగ సంపర్కుడినని చెప్పిన జాకుబ్ జాంక్టో

జాంక్టో

సహచర ఆటగాళ్లకు ముందే చెప్పిన జాంక్టో

స్పార్టా ప్రేగ్ దీనిపై మాట్లాడుతూ జాంక్టో గతంలో తన లైంగిక ధోరణి గురించి క్లబ్‌కుచ అతని సహచరులకు ముందుగానే చెప్పినట్లు ధ్రువీకరించాడు. జాకుబ్ జాంక్టో కొంతకాలం క్రితమే ఈ విషయంపై తన సహచరులతో చర్చించినట్లు క్లబ్ కూడా ట్విట్టర్ వేదికగా పేర్కొనడం గమనార్హం. జకుబ్ కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, తన జీవితాన్ని ప్రశాతంగా గడపాలని క్లబ్ తెలిపింది. తమ ఫుట్‌బాల్ ఆటగాడు జాకుబ్ జాంక్టోపై గౌరవం, అభిమానం ఎల్లవేళలా ఉంటాయని మాడ్రిడ్ తన ట్విట్టర్ లో పోస్టు చేశాడు.