Loading...
IPL 2026 Finishers : డెత్ ఓవర్లలో డేంజర్ ప్లేయర్స్.. మ్యాచును ములుపుతిప్పే ఫినిషర్లు వీరే!
డెత్ ఓవర్లలో డేంజర్ ప్లేయర్స్.. మ్యాచును ములుపుతిప్పే ఫినిషర్లు వీరే!

IPL 2026 Finishers : డెత్ ఓవర్లలో డేంజర్ ప్లేయర్స్.. మ్యాచును ములుపుతిప్పే ఫినిషర్లు వీరే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 21, 2026
03:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ అంటే చివరి ఓవర్ వరకు ఉత్కంఠతో సాగే మ్యాచ్‌లు. ఆ ఉత్కంఠలో జట్టును విజయతీరాలకు చేర్చే ఆటగాళ్లే అసలైన ఫినిషర్లు. ఐపీఎల్ 2026 సీజన్ ముందుగా అన్ని జట్లలో ఉన్న ఫినిషర్లపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈసారి మొత్తం 10 జట్లలో కలిపి 31 మంది కీలక ఫినిషర్లు సిద్ధంగా ఉన్నారు. మరి ఏ జట్టులో ఎలాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారో పరిశీలిద్దాం.

Details

ముంబై ఇండియన్స్ (MI)

హార్దిక్ పాండ్యా

కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా ఒత్తిడిలో భారీ షాట్లు ఆడటంలో నిపుణుడు. డెత్ ఓవర్లలో అతని స్ట్రైక్ రేట్ 170కు పైగా ఉంటుంది.

నమన్ ధీర్

తక్కువ బంతుల్లోనే మ్యాచ్‌ను తారుమారు చేసే శక్తి కలిగిన యువ ఆటగాడు.

విల్ జాక్స్

అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా సెంచరీలు చేసిన రికార్డు ఉన్నాడు. స్పిన్, పేస్ తేడా లేకుండా దాడి చేయగలడు.

Details

చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

ఎంఎస్ ధోనీ

ఐపీఎల్ చరిత్రలోనే గొప్ప ఫినిషర్. 20వ ఓవర్లో అత్యధిక సిక్సర్ల రికార్డు అతనిదే. శివం దూబే: స్పిన్ బౌలర్లపై దాడి చేయడంలో అగ్రగామి. చిన్న గ్రౌండ్లలో అతని సిక్సర్లు ప్రత్యేకం.

కార్తీక్ శర్మ

డొమెస్టిక్ క్రికెట్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో గుర్తింపు పొందిన ఆటగాడు.

డెవాల్డ్ బ్రెవిస్

'బేబీ ఏబీ'గా ప్రసిద్ధి. 360 డిగ్రీల షాట్లతో మ్యాచ్‌ను మలుపుతిప్పగలడు.

ADVERTISEMENT

Details

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

టిమ్ డేవిడ్

ప్రపంచ లీగ్‌లలో భారీ సిక్సర్లు కొట్టడంలో పేరుగాంచిన ఫినిషర్.

జితేష్ శర్మ

మొదటి బంతి నుంచే బలంగా బాదే వికెట్ కీపర్ బ్యాటర్.

రొమారియో షెపర్డ్

డెత్ ఓవర్లలో ఒక్క ఓవర్లోనే భారీ పరుగులు రాబట్టగల కరీబియన్ పవర్ హిట్టర్.

ఢిల్లీ క్యాపిటల్స్ (DC)

డేవిడ్ మిల్లర్

'మిల్లర్ ది కిల్లర్'గా ప్రసిద్ధి. ఒత్తిడిలోనూ కూల్‌గా మ్యాచ్‌ను ముగిస్తాడు.

సమీర్ రిజ్వీ

యువ వయసులోనే భారీ ధరకు అమ్ముడైన హిట్టర్.

అశుతోష్ శర్మ

తక్కువ బంతుల్లో సిక్సర్లు బాదుతూ మ్యాచ్‌ను మార్చగలడు.

ADVERTISEMENT

Deatails

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)

హెన్రిక్ క్లాసెన్: ప్రస్తుతం అత్యుత్తమ వైట్ బాల్ బ్యాటర్లలో ఒకడు. స్పిన్నర్లపై అద్భుతంగా రాణించగలడు

లియామ్ లివింగ్‌స్టన్

ఐపీఎల్‌లో 117 మీటర్ల భారీ సిక్సర్ రికార్డు కలిగిన ఆటగాడు.

అనికేత్ వర్మ

దేశవాళీ క్రికెట్ నుంచి ఎదిగిన యువ ఫినిషర్.

గుజరాత్ టైటాన్స్ (GT)

రాహుల్ తెవాటియా

చివరి బంతుల్లో సిక్సర్లు కొట్టి మ్యాచ్‌లు గెలిపించిన మిరాకిల్ ఫినిషర్.

జేసన్ హోల్డర్

బ్యాట్, బాల్ రెండింట్లోనూ కీలక పాత్ర పోషించే ఆల్‌రౌండర్.

గ్లెన్ ఫిలిప్స్

అసాధ్యమైన షాట్లు సులభంగా ఆడే సామర్థ్యం కలిగిన ఆటగాడు.

Details

లక్నో సూపర్ జెయింట్స్ (LSG)

నికోలస్ పూరన్

టీ20ల్లో భారీ సిక్సర్లకు ప్రసిద్ధి చెందిన కరీబియన్ బ్యాటర్.

ఆయుష్ బదోని

360 డిగ్రీల షాట్లతో మైదానం నలుమూలలా బంతిని పంపగలడు.

అబ్దుల్ సమద్

చివర్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడే పవర్ హిట్టర్.

రాజస్థాన్ రాయల్స్ (RR)

షిమ్రాన్ హెట్మెయర్

డెత్ ఓవర్లలో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన బ్యాటర్.

శుభమ్ దూబే

భారీ ధరతో జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు.

డోనోవన్ ఫెరీరా

బంతిని క్లీన్‌గా హిట్ చేయడంలో దిట్ట.

Details

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)

రింకూ సింగ్

5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించిన ఫినిషర్.

రమణ్‌దీప్ సింగ్

గత సీజన్‌లో కీలక ఇన్నింగ్స్‌లతో జట్టుకు టైటిల్ అందించడంలో పాత్ర పోషించాడు.

రికార్డో పావెల్

భారీ షాట్లతో బంతిని స్టాండ్స్‌లోకి పంపగలడు.

పంజాబ్ కింగ్స్ (PBKS)

శశాంక్ సింగ్

అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు.

మార్కస్ స్టోయినిస్

సెంచరీలతో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించిన అనుభవం ఉన్న ఆల్‌రౌండర్.

మార్కో జాన్సెన్

బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ కీలక పాత్ర పోషించే ఆటగాడు.

ఇలా ప్రతి జట్టులోనూ మ్యాచ్‌ను చివరి క్షణాల్లో మలుపుతిప్పగల ఫినిషర్లు సిద్ధంగా ఉన్నారు. ఐపీఎల్ 2026లో ఈ ఫినిషర్ల మధ్య పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.

ADVERTISEMENT