Loading...
Danish Kaneria: విద్యార్థుల ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు
విద్యార్థుల ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు

Danish Kaneria: విద్యార్థుల ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 23, 2026
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు దాదాపు నెల రోజులుగా చేపడుతున్న నిరసనల నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (మాజీ ట్విట్టర్)లో స్పందించారు. ఈ ఆందోళనలను కనేరియా "సర్కస్", "తమాషా"గా అభివర్ణించారు. భారత్‌లో జరిగే చాలా నిరసనల్లో శ్రీరాముడు, భారతదేశం, ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన దివంగత తల్లి, బ్రాహ్మణులు, హిందుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం ఒక ధోరణిగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

వివరాలు

భారత్‌లో నేపాల్ తరహా పరిస్థితులు..

ఇలాంటి విధానాలతో ఒకరోజు భారత్‌లో నేపాల్ తరహా పరిస్థితులు తీసుకురాగలమనే భ్రమలో ప్రతిపక్షాలు ఉన్నట్లు తనకు అనిపిస్తోందని పేర్కొన్నారు.

అంతేకాదు, అమెరికాతో ఇంకా ఒక్క వాణిజ్య ఒప్పందం కూడా ఖరారు కాకముందే కొందరు రైతులు ఢిల్లీని ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

చర్చలు, పరిష్కార మార్గాలను పక్కనబెట్టి కేవలం అలజడి సృష్టించడమే కొందరి లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు.

వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిపక్షాలు, కొందరు ప్రజలు నిరసనల్లో పాల్గొనడం వల్ల దేశ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

అయితే, పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి భారత విద్యార్థుల ఆందోళనలను ఈ విధంగా అవమానకరంగా వ్యాఖ్యానించడం పట్ల భారతీయ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

సోషల్ మీడియాలో కనేరియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాలు

ఆ ఆరోపణలు వాస్తవమేనా?

డానిష్ కనేరియా పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన హిందూ క్రికెటర్లలో ఒకరు.

2000 నుంచి 2010 మధ్యకాలంలో 61 టెస్టు మ్యాచ్‌లు ఆడి 261 వికెట్లు సాధించిన ఆయన విజయవంతమైన లెగ్ స్పిన్నర్‌గా గుర్తింపు పొందారు.

అయితే, 2012లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఆయనపై జీవితకాల నిషేధం విధించింది.

ఇక, పాకిస్థాన్ జట్టులో కొనసాగిన రోజుల్లో తాను హిందువుననే కారణంతో తీవ్ర వివక్షను ఎదుర్కొన్నానని కనేరియా గతంలో ఆరోపించారు.

మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తనను ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చారని, కలిసి భోజనం చేయడానికి కూడా నిరాకరించేవారని ఆయన చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనంగా మారాయి.

ADVERTISEMENT