Page Loader
దసున్ శనక సెంచరీ వృథా
88 బంతుల్లో 108 పరుగులు చేసిన షనక

దసున్ శనక సెంచరీ వృథా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2023
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక కెప్టెన్ దసున్ శనక (108) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. నిస్సంక (72), డి సిల్వ (47) రాణించినా శ్రీలంకను విజయతీరాలకు చేర్చలేకపోయారు. షశన వన్డేల్లో తన రెండో సెంచరీని నమోదు చేశారు. శ్రీలంక ఒకానొక దశలో 136 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. 200 పరుగులు సాధించలేని దశలో కసున్ రజితతో కలిసి కెప్టెన్ షశక 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. షనక ఒత్తిడిలో కూడా బాగా రాణించాడు.

షకన

వన్డేలో 1000 పరుగులు సాధించాడు

గౌహతిలో జరిగిన వన్డేల్లో షనక 1,000 పరుగుల మైలురాయిని అందుకొని సత్తా చాటాడు. 46 ODIల్లో 27.73 సగటుతో 1,054 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.ఇందులో మూడు అర్ధసెంచరీలు, ఒక సెంచరీ ఉంది. భారత్ పై దసున్ శకన వరుసగా 108*(88), 23(17), 47*(19), 74*(38), 33*(18), 45(27), 56*(22) పరుగులు చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో T20 క్రికెట్‌లో భారత్‌పై 400కి పైగా పరుగులు చేసిన మొట్టమొదటి శ్రీలంక బ్యాటర్ గా శనక నిలిచాడు. మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా తొలి 10 ఓవర్లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ 75 పరుగులు చేశారు. అనంతరం విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో భారత్ 373 పరుగులు సాధించింది.