Loading...
Asia Cup 2026: భారత్‌-పాక్‌ హైవోల్టేజ్‌ పోరుకు తేదీ ఖరారు.. పాక్‌ జట్టు ఇదే!
భారత్‌-పాక్‌ హైవోల్టేజ్‌ పోరుకు తేదీ ఖరారు.. పాక్‌ జట్టు ఇదే!

Asia Cup 2026: భారత్‌-పాక్‌ హైవోల్టేజ్‌ పోరుకు తేదీ ఖరారు.. పాక్‌ జట్టు ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2026
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా క్రికెట్‌ వేదికపై మరో హైవోల్టేజ్‌ సమరానికి రంగం సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ఆసియా కప్‌ 2026 టోర్నీ కోసం పాకిస్థాన్‌ తమ జట్టును ప్రకటించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ తలపడనున్నాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ దాయాదుల పోరుకు తేదీ కూడా ఖరారైంది.

వివరాలు

యూఏఈ వేదికగా ఆసియా కప్

మహిళల టీ20 ఆసియా కప్‌ పదో సీజన్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఈ టోర్నీ జరగనుంది.

మొత్తం ఎనిమిది ఆసియా దేశాలు పోటీపడనున్నాయి. నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా జట్లను విభజించారు.

గ్రూప్‌-ఎలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌తో పాటు పాకిస్థాన్‌, థాయిలాండ్‌, హాంకాంగ్‌ ఉన్నాయి.

దీంతో చిరకాల ప్రత్యర్థులైన భారత్‌, పాకిస్థాన్‌ లీగ్‌ దశలోనే తలపడటం ఖాయమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన మహిళల జట్టును అధికారికంగా ప్రకటించింది.

వివరాలు

సెప్టెంబర్‌ 5న భారత్‌-పాక్‌ అమీతుమీ

మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు ఆగస్టు 30న థాయిలాండ్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. సెప్టెంబర్‌ 3న హాంకాంగ్‌తో రెండో మ్యాచ్‌ ఆడుతుంది.

గ్రూప్‌ దశలో చివరి మ్యాచ్‌లో సెప్టెంబర్‌ 5న పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది. దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఈ హైవోల్టేజ్‌ పోరుకు వేదిక కానుంది.

రెండు జట్ల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్‌పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ADVERTISEMENT

వివరాలు

ఫాతిమా సనాకు కెప్టెన్సీ

ఆసియా కప్‌తో పాటు జపాన్‌ వేదికగా జరగనున్న ఏషియన్‌ గేమ్స్‌ 2026 కోసం కూడా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు మహిళల జట్లను ప్రకటించింది.

ఈ రెండు టోర్నీలకు యువ ఆల్‌రౌండర్‌ ఫాతిమా సనాను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. గతంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలను చేపట్టనుంది.

ఏషియన్‌ గేమ్స్‌ జట్టులో సీనియర్‌ బ్యాటర్‌ అలియా రియాజ్‌కు చోటు దక్కింది. మరోవైపు సదాఫ్‌ షమాస్‌, సిద్రా అమీన్‌లను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.

జపాన్‌లో జరిగే ఏషియన్‌ గేమ్స్‌లో పాకిస్థాన్‌ నేరుగా క్వార్టర్‌ ఫైనల్స్‌ నుంచి పోటీలోకి దిగనుంది. సెప్టెంబర్‌ 17న థాయిలాండ్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ ఆడనుంది.

ADVERTISEMENT

వివరాలు

ఆసియా కప్‌ పాక్‌ జట్టు ఇదే..

సెప్టెంబర్‌ 20న సెమీఫైనల్‌, సెప్టెంబర్‌ 22న స్వర్ణ పతక పోరు జరగనుంది. ఆసియా కప్‌ కోసం ప్రకటించిన పాకిస్థాన్‌ జట్టులో మునీబా అలీ సిద్దిఖీ వికెట్‌ కీపర్‌గా వ్యవహరించనుంది.

అయేషా జాఫర్‌, ఇమాన్‌ నసీర్‌, ఏమాన్‌ ఫాతిమా, గుల్‌ ఫిరోజా, మోమినా రియాసత్‌, నజీహా అల్వీ, నష్రా సంధు, సాదియా ఇక్బాల్‌, సైరా జబీన్‌, షావాల్‌ జుల్ఫికర్‌, తుబా హసన్‌, ఉమ్మె హానీ, వహీదా అక్తర్‌ ప్రధాన జట్టులో చోటు దక్కించుకున్నారు.

స్టాండ్‌బై ఆటగాళ్లుగా తస్మియా రుబాబ్‌, హుమ్నా బిలాల్‌, మహమ్‌ అనీస్‌, సదఫ్‌ షమాస్‌లను ఎంపిక చేశారు.

వివరాలు

ఏషియన్‌ గేమ్స్‌ జట్టులోనూ దాదాపు ఇదే బృందం

ఏషియన్‌ గేమ్స్‌ జట్టులోనూ దాదాపు ఇదే ఆటగాళ్లు కొనసాగనున్నారు. సీనియర్‌ బ్యాటర్‌ అలియా రియాజ్‌ అదనపు బలంగా జట్టులో చేరింది.

రిజర్వ్‌ జాబితాలో నతాలియా పర్వేజ్‌, రమీన్‌ షమీమ్‌ వంటి క్రీడాకారిణులకు చోటు కల్పించారు.

సరికొత్త వ్యూహాలతో ఆసియా కప్‌, ఏషియన్‌ గేమ్స్‌లో బరిలోకి దిగనున్న పాకిస్థాన్‌ మహిళల జట్టు.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌కు ఎంతమేరకు పోటీ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా సెప్టెంబర్‌ 5న దుబాయ్‌లో జరగనున్న భారత్‌-పాక్‌ పోరుపైనే అభిమానుల దృష్టి కేంద్రీకృతమైంది.

ADVERTISEMENT