WPL-2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ పూర్తి షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 23న తొలి మ్యాచ్
Women's Premier League 2024 schedule: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2024 షెడ్యూల్ విడుదలైంది. తొలి మ్యాచ్‌లో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో గతేడాది ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌తో దిల్లీ క్యాపిటల్స్ లపడనుంది. డబ్ల్యూపీఎల్-2024(WPL) సీజన్ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్‌లో మొత్తం 22మ్యాచ్‌లు జరగనున్నాయి. చివరి మ్యాచ్ మార్చి 17న దిల్లీలో జరగనుంది. అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30గంటలకు ప్రారంభమవుతాయి. గత సంవత్సరం మాదిరిగానే డబ్ల్యూపీఎల్-2024లోనూ లీగ్ దశలో మొదటి మూడు జట్లు ప్లేఆఫ్‌లకు అర్హత సాధిస్తాయి. లీగ్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుండగా, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు మార్చి 15న ఎలిమినేషన్‌లో తలపడతాయి.
బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్‌లు ఇవే
23 ఫిబ్రవరి-ముంబై ఇండియన్స్ vs దిల్లీ క్యాపిటల్స్ ఫిబ్రవరి 24-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్స్ 25 ఫిబ్రవరి-గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ ఫిబ్రవరి 26- యూపీ వారియర్స్ vs దిల్లీ క్యాపిటల్స్ 27 ఫిబ్రవరి- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ 28 ఫిబ్రవరి- ముంబై ఇండియన్స్ vs యూపీ వారియర్స్ ఫిబ్రవరి 29- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs దిల్లీ క్యాపిటల్స్ మార్చి 1- యూపీ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ మార్చి 2- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ మార్చి 3- గుజరాత్ జెయింట్స్ vs దిల్లీ క్యాపిటల్స్ మార్చి 4- యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
దిల్లీ వేదికగా జరిగే మ్యాచ్‌లు ఇవే
మార్చి 5- యూపీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ మార్చి 6- గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్చి 7- యూపీ వారియర్స్ vs ముంబై ఇండియన్స్ మార్చి 8- దిల్లీ క్యాపిటల్స్ vs UP వారియర్స్ మార్చి 9- ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ మార్చి 10 - దిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్చి 11 - గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్స్ మార్చి 12 - ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్చి 13 - దిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ మార్చి 15 - దిల్లీలో ఎలిమినేటర్ మార్చి 17 - దిల్లీలో ఫైనల్