LOADING...
#Play of the day: గాయాన్నే పట్టించుకోని మిల్లర్… నిజమైన పోరాట యోధుడు
గాయాన్నే పట్టించుకోని మిల్లర్… నిజమైన పోరాట యోధుడు

#Play of the day: గాయాన్నే పట్టించుకోని మిల్లర్… నిజమైన పోరాట యోధుడు

వ్రాసిన వారు Moogati Shabari
Apr 09, 2026
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను కేవలం ఒక పరుగుతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టు చివరకు 209 పరుగుల వద్ద నిలిచిపోయింది. చివరి బంతిలో కుల్దీప్ యాదవ్ రనౌట్ కావడం మ్యాచ్‌కు కీలక మలుపు తీసుకొచ్చి, గుజరాత్‌కు విజయాన్ని అందించింది.

వివరాలు

కీలక దశలో గాయం..

మ్యాచ్ కీలక దశలో ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాల్సి రావడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. అతను 10 బంతుల్లో 12 పరుగులు చేసి, 13వ ఓవర్ సమయంలో ఆటను మధ్యలోనే ఆపి డగౌట్‌కు వెళ్లాడు. మిల్లర్ వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీస్తూ ఉండగా అతని చేతికి గాయమైంది. అంతకుముందే ఫీల్డింగ్ సమయంలో బంతిని అందుకునేందుకు పలుమార్లు డైవ్‌లు చేయడం వల్ల గాయపడ్డాడు. అయినప్పటికీ ఫీల్డింగ్ కొనసాగించాడు. 13వ ఓవర్‌లో గ్లోవ్స్ తీసి బొటనవేలును పట్టుకుని నొప్పితో బాధపడుతున్నట్లు కనిపించాడు. ఒక పరుగుకోసం ప్రయత్నించే క్రమంలో క్రీజ్ చేరుకునేందుకు డైవ్ చేయడంతో గాయం మరింత తీవ్రంగా మారింది.

వివరాలు

ఆ షాట్ ఆడుంటే గెలుపు ఖాయం..

మిల్లర్ బయటకు వెళ్లిన తర్వాత అక్షర్ పటేల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. తరువాత ట్రిస్టన్ స్టబ్స్ అవుట్ అయిన అనంతరం, మిల్లర్ మళ్లీ క్రీజ్‌లోకి వచ్చాడు. గాయం ఉన్నప్పటికీ అతను ధైర్యంగా బ్యాటింగ్ కొనసాగించాడు. 16.4 ఓవర్ల సమయంలో ఢిల్లీ స్కోరు 161/5గా ఉన్నప్పుడు, గెలవడానికి 20 బంతుల్లో 50 పరుగులు అవసరమైన క్లిష్ట సమయంలో కేఎల్ రాహుల్‌తో కలిసి భాగస్వామ్యాన్ని నిర్మించాడు. చివర్లో స్కోరు సమం చేయడానికి ఒక్క పరుగే అవసరమైన సమయంలో మిల్లర్ చివరి బంతిని ఎదుర్కొన్నాడు. అది ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఓవర్. అతను వేసిన స్లోయర్ బౌన్సర్‌ను మిల్లర్ ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ బంతి తగల్లేదు.

Advertisement

వివరాలు

అభినందనల వెల్లువ..

బంతి నేరుగా వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతికి వెళ్లింది. అయినప్పటికీ మిల్లర్ పరుగుకు ప్రయత్నించాడు. అయితే నాన్-స్ట్రైకింగ్ ఎండ్ నుంచి కుల్దీప్ యాదవ్ సమయానికి క్రీజ్ చేరుకోలేకపోయాడు. అప్పటికే బట్లర్ వికెట్లను పడగొట్టడంతో ఢిల్లీ ఓటమి ఖాయం అయింది. గాయంతో ఇబ్బంది పడుతూ కూడా పోరాడిన డేవిడ్ మిల్లర్‌ను గుజరాత్ కెప్టెన్ శుభ‌మన్ గిల్, సిరాజ్, జోస్ బట్లర్, కగిసో రబడతో పాటు ఇతర ఆటగాళ్లు అభినందించారు. అతని ధైర్యసాహసాలను మెచ్చుకుని భుజం తట్టి ప్రోత్సహించారు. అనంతరం మైదానంలోకి వచ్చిన అక్షర్ పటేల్ కూడా మిల్లర్‌ను ఆప్యాయంగా పలకరించాడు.

Advertisement