క్రికెట్ ఆస్ట్రేలియాపై మరోసారి మండిపడ్డ డేవిడ్ వార్నర్
ఈ వార్తాకథనం ఏంటి
బాల్ టాంపరింగ్ స్కామ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై 2018లో రెండేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.
అప్పట్లో స్టీవ్ స్మిత్, వార్నర్ కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలువచ్చాయి. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా సీరియస్ అయింది. వార్నర్ భవిష్యత్తులో కెప్టెన్ కాకుండా బ్యాన్ విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది.
మరోవైపు స్టీవ్ స్మిత్ పై మాత్రం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియాపై వార్నర్ మద్దతుదారులు విమర్శలు కురిపించారు. కెప్టెన్సీ బ్యాన్ పై అప్పట్లో వార్నర్ రివ్యూ పిటీషన్ ను దాఖలు చేశాడు.
అయితే ఈ కేసును బహిరంగంగా విచారణ చేపట్టాలని నిర్ణయించడంతో వార్నర్ తన రివ్యూ పిటిషన్ ను ఉపసంహరించుకున్నాడు.
Details
సీఏ పాలనలో నాయకత్వం లోపించింది : వార్నర్
ప్రస్తుతం ఈ విషయాలను గుర్తు చేసుకుంటూ వార్నర్ క్రికెట్ ఆస్ట్రేలియా తీరుపై మండిపడ్డాడు. తన విషయంలో సీఏ తీరు హ్యాస్యాస్పదంగా ఉందని, తాను గతాన్ని మర్చిపోవాలని భావిస్తున్నా, క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం దానిని ఇంకా కొనసాగిస్తూనే ఉందని, సీఏ పాలనలో స్పష్టంగా నాయకత్వ లోపించిందని వార్నర్ చెప్పుకొచ్చాడు.
ప్రతిసారీ సీఏ పెద్దలు ఈ విషయాన్ని బయటికి తీస్తున్నారని, దీనివల్ల తన బ్యాటింగ్ ప్రదర్శన పై పెను ప్రభావం పడుతోందని, ఇదంతా తనకు అగౌరవంగా అనిపించిందని, దీంతో తాను తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాయనని వార్నర్ వెల్లడించారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ముందు వార్నర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.