గిల్‌లో ఆటిట్యూడ్ కనిపిస్తోంది.. ఆసీస్ బౌలర్లకు ఆ షాట్ తో సమాధానం చెప్పాలి: పాటింగ్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్- ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా యువ ప్లేయర్ శుభ్‌మాన్ గిల్ ఎలా ఆడాలో ఆసీసీ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక సూచన చేశాడు. ఈ మధ్య కాలంలో అన్ని ఫార్మాట్లోనూ గిల్ సత్తా చాటుతున్నాడు. డబ్య్లూటీసీ ఫైనల్లోనూ మరోసారి గిల్ విజృంభించాలని అభిమానులు కోరుతున్నారు. ఐపీఎల్లో 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో రికి పాటింగ్ అతనిపై ప్రశంసంల వర్షం కురిపించాడు. అతడోక అద్భుతమైన యువకుడి అని, అతనిలో ఆ ఆటిట్యూడ్ కనిస్తోందని, ఆసీస్ పేస్ బౌలర్లపై అతడు ఫ్రంట్ ఫుట్ ఫుల్ షాట్ ఆడితే బాగుంటుందని సూచించాడు.
అద్భుత ఫామ్ లో గిల్
గిల్ మంచి క్లాసికల్ ప్లేయర్ అని, ఆస్ట్రేలియా బౌలర్లపై అతను రాణించే అవకాశం ఉందని గిల్ అభిప్రాయపడ్డాడు. డబ్య్లూటీసీ ఫైనల్లో గిల్, కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. శుభ్‌మాన్ గిల్, షమీ, జడేజా గురువారమే ఇంగ్లాండ్ కు చేరుకున్నాడు. గత ఆరేడు నెలలుగా గిల్ అద్భుతమైన ఫామ్ లో ఉండి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది మొదట్లోనే శ్రీలంకపై వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం క్రికెట్ అభిమానులు గిల్‌ను విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తో పోలుస్తున్నారు. ప్రస్తుతం రికి పాటింగ్ కూడా గిల్ ఆటకు ఫిదా అయిపోయాడు.