డబ్య్లూటీసీ ఫైనల్ కు ముందు ఆస్ట్రేలియా సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం!
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచు కోసం ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. లండన్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకూ భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. తొలిసారిగా టెస్టు చాంఫియన్ షిప్ ఫైనల్ లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ఎలాగైనా విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియా గత కొన్నేళ్లుగా టెస్టుల్లో అరుదైన ఘనతలను సాధించింది. 2021-22లో పాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ పై యాషెస్ సిరీస్ ను ఆస్ట్రేలియా 4-0 తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్ చేజార్చుకున్న ఇంగ్లాండ్ కు అప్పట్లో ఘోర పరాభావం ఎదురైంది.
కంగారులు టెస్టుల్లో సాధించిన విజయాలు
ఆస్ట్రేలియా 2022 పర్యటనలో పాకిస్తాన్ పై టెస్టు సిరీస్ ఆడింది. మూడు మ్యాచుల సిరీస్ భాగంగా మొదటి రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. అయితే చివరి మ్యాచులో ఆస్ట్రేలియా 115 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో సిరీస్ 1-0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. అయితే ఉపఖండంలో ఆసీస్ జట్టుకు ఇది తొలి సిరీస్ విజయం కావడం విశేషం. ఆ తర్వాత ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం శ్రీలంకకు వెళ్లింది. ఈ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. 2022 చివర్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ను స్వదేశంలో 2-0తో ఓడించి రికార్డు సృష్టించింది. సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కంగారులు పైచేయి సాధించారు.