David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్.. కోర్టులో నేరం అంగీకారం
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడిగా నిలిచాడు. ఈ కేసు విచారణ సందర్భంగా సిడ్నీ కోర్టులో ఆయన తరఫు న్యాయవాది హాజరై నేరాన్ని అంగీకరించారు. ఈ నేపథ్యంలో వార్నర్‌కు విధించాల్సిన శిక్షపై కోర్టు ఆగస్టు 18న తుది నిర్ణయం వెల్లడించనుంది. అందిన సమాచారం ప్రకారం, కొన్ని నెలల క్రితం డేవిడ్ వార్నర్ ఒక వ్యాన్ నడుపుతూ వెళ్తుండగా, పోలీసులు ఏర్పాటు చేసిన ర్యాండమ్ బ్రెత్ టెస్టింగ్ కేంద్రానికి సమీపంలో తన వాహనాన్ని నిలిపాడు. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఆయనకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించారు.
వివరాలు
మిడ్ రేంజ్ డ్రింక్ డ్రైవింగ్..
ఆ పరీక్షలో చట్టబద్ధ పరిమితికి మించి మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో వార్నర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ కేసు విచారణకు వార్నర్ స్వయంగా కోర్టుకు హాజరుకాలేదు.
ఆయన తరఫున న్యాయవాది బాబీ హిల్ విచారణకు హాజరై, 'మిడ్ రేంజ్ డ్రింక్ డ్రైవింగ్' నేరాన్ని అంగీకరించారు.
వివరాలు
ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరుగా గుర్తింపు..
విచారణ అనంతరం న్యాయవాది బాబీ హిల్ మాట్లాడుతూ, "జీవితంలో కొన్నిసార్లు ప్రతి ఒక్కరూ తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
అయితే వాటికి బాధ్యత వహించడం అత్యంత ముఖ్యం. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా గుర్తింపు పొందిన వ్యక్తి అయినా, ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా ఎదురయ్యే అవకాశం ఉంది" అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా దేశవాళీ టీ20 టోర్నమెంట్ బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.