శబాష్.. 5వేల మార్కును దాటిన డీన్ ఎల్గర్
ఆస్ట్రేలియా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ధక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టులో 5వేల పరుగుల చేసి రికార్డును సృష్టించాడు. టెస్టులో ఈ మైలురాయిని అందుకున్న ఎనిమిదోవ క్రికెటర్గా నిలిచాడు. డీన్ ఎల్గర్ కంటే ముందు జాక్వెస్ కల్లిస్ (13,206), హషీమ్ ఆమ్లా (9,282), గ్రేమ్ స్మిత్ (9,253), ఏబీ డివిలియర్స్ (8,765), గ్యారీ కిర్‌స్టన్ (7,289), హెర్షెల్ గిబ్స్ (6,167), మార్క్ బౌచర్ (5,498) ఉన్నారు. ఎల్గర్ 81 మ్యాచ్ లో 5002 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలు, 22 అర్ద సెంచరీలున్నాయి.
సౌతాఫ్రికా 189 పరుగులకు ఆలౌట్
బ్యాటింగ్‌కు దిగి, సౌతాఫ్రికా మొదటి సెషన్‌లోనే (58/4) కుప్పకూలింది. 23వ ఓవర్‌లో ఎల్గర్, టెంబా బావుమా ఇద్దరూ బ్యాక్-టు-బ్యాక్ డెలివరీలలో అవుట్ కావడంతో సౌతాఫ్రికాకు కోలుకోలేని దెబ్బ పడింది. కాసేపటి తర్వాత కైల్ వెర్రెయిన్, మార్కో జాన్సెన్ ఆరో వికెట్‌కు 100 పరుగులు సాధించి, సౌతాఫ్రికాను గాడిలో పెట్టారు. సౌతాఫ్రికా 68.4 ఓవర్లకు 189 పరుగులు ఆలౌటైంది. ఆస్ట్రేలియా 12 ఓవర్లకు 45 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం అస్ట్రేలియా 144 పరుగుల అధిక్యంలో ఉంది.