
రాహుల్ ఐదో స్థానానికి ఫర్‌ఫెక్ట్..!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియా, శ్రీలంక మధ్య గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కెఎల్ రాహుల్ ఆచితూచి ఆడి భారత్‌కు విజయాన్ని అందించాడు. గతంలో టీమిండియా ఓపెనర్ గా వచ్చిన రాహుల్ గత రెండు సిరీస్ ల్లో తన స్థానాన్ని మార్చుకున్నాడు.
వన్డేలలో కొత్త ఓపెనర్ శుభమన్ గిల్ నిలకడగా రాణిస్తుండటంతో..ప్రస్తుతం ఐదో నంబర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతూ మెరుగ్గా రాణిస్తున్నాడు.
రెండో వన్డేలో కేఎల్ రాహుల్ శ్రీలంకపై తొలి అర్ధసెంచరీని నమోదు చేశారు. గతంలో శ్రీలంక పై సెంచరీ చేశారు. రాహుల్ 43.88 సగటుతో 1,799 పరుగులు చేశాడు.
కెఎల్ రాహుల్
ఐదో స్థానంలో కెఎల్ రాహుల్ రికార్డులివే
రాహుల్ ఇప్పుడు వన్డే క్రికెట్‌లో ఐదో నంబర్ బ్యాట్ మెన్స్ గా 15 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ స్థానంలో 54.25 సగటుతో 651 పరుగులు చేశాడు. ముఖ్యంగా, ఐదవ స్థానంలో ఉన్న అతని ODI సగటు ఇతర స్థానాలతో పోలిస్తే అత్యధికంగా ఉండడం గమనార్హం.
ఐదో స్థానంలో వచ్చి గతంలో ఓ సెంచరీ, ఆరు అర్ధసెంచరీలు చేశారు.
జనవరి 2021 నుండి టీమిండియా తరపున ఐదో స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రాహుల్ నిలిచాడు.
టీ20ల నుంచి రాహుల్‌ను తప్పించినప్పటికీ, వన్డేల్లో నిలకడగా రాణిస్తున్నాడు. వన్డేలో వరుసగా 64*, 39, 8, 14, 73 పరుగులు చేశాడు.