LOADING...
Rohit Sharma: ఐపీఎల్‌ 2026లో రోహిత్ శర్మ ప్రదర్శన ఎలా ఉంది?.. గణాంకాలు ఏమంటున్నాయంటే!
ఐపీఎల్‌ 2026లో రోహిత్ శర్మ ప్రదర్శన ఎలా ఉంది?.. గణాంకాలు ఏమంటున్నాయంటే!

Rohit Sharma: ఐపీఎల్‌ 2026లో రోహిత్ శర్మ ప్రదర్శన ఎలా ఉంది?.. గణాంకాలు ఏమంటున్నాయంటే!

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2026
10:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

రోహిత్ శర్మఐపీఎల్‌ సీజన్‌లో మంచి ఫామ్‌లో కనిపిస్తున్నప్పటికీ.. కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. తాజాగా ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న రోహిత్ శర్మ, కోల్‌కతా నైట్ రైడర్స్'తో జరిగిన మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఐపీఎల్‌ 2026 సీజన్‌ 65వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌లు తగిలాయి. జట్టు స్కోరు 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇందులో రోహిత్ శర్మ వికెట్ కూడా ఉండటం గమనార్హం.

వివరాలు 

8 మ్యాచ్‌లు.. 283 పరుగులు

టాస్‌ గెలిచిన కేకేఆర్‌ ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే తొలి ఓవర్లలోనే రోహిత్ శర్మ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కామెరాన్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో భారీ సిక్స్‌ కొట్టిన రోహిత్.. అదే ఓవర్‌లో ర్యాన్‌ రికెల్టన్‌,నమన్‌ ధీర్‌ వికెట్లు పడిపోవడంతో ఒత్తిడిలో పడ్డాడు. అనంతరం సౌరభ్‌ దూబే బౌలింగ్‌లో మరో సిక్స్‌ బాదిన రోహిత్.. భారీ షాట్‌కు ప్రయత్నించి కామెరాన్‌ గ్రీన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అతడు 13 బంతుల్లో 15 పరుగులు చేశాడు.ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 283 పరుగులు సాధించాడు. అతడి సగటు 40.42గా ఉంది.రెండు అర్ధసెంచరీలు నమోదు చేసిన హిట్‌మ్యాన్‌ అత్యధిక స్కోరు 84.

వివరాలు 

ఈ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించిన రోహిత్

మొత్తం 21 ఫోర్లు, 21 సిక్సర్లు బాదిన రోహిత్ స్ట్రైక్‌రేట్‌ 160.79గా ఉంది. మొత్తం 176 బంతులు ఎదుర్కొన్నాడు. ఈ సీజన్‌ను రోహిత్ అద్భుతంగా ప్రారంభించాడు. ముంబైలో కేకేఆర్‌పైనే 78 పరుగులు చేసి మెరిశాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌పై 35 పరుగులు చేశాడు. తరువాతి మ్యాచ్‌ల్లో 5, 19* స్కోర్లు నమోదు చేశాడు. ముఖ్యంగా అజేయంగా 19 పరుగులు చేసిన మ్యాచ్‌లో గాయంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన రోహిత్.. లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 84 పరుగులతో అదరగొట్టాడు. ఆ తర్వాత 22, 25 పరుగులు చేసి.. ఇప్పుడు కేకేఆర్‌పై 15 పరుగులతో సరిపెట్టుకున్నాడు.

Advertisement

వివరాలు 

మూడు సార్లు పవర్‌ప్లేలో ఔటైన రోహిత్

అయితే ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్‌లలో మూడు సార్లు పవర్‌ప్లేలోనే అవుటయ్యాడు. ముఖ్యంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 10వ ఓవర్‌లో ఔటై 26 బంతుల్లో 25 పరుగులే చేశాడు.

Advertisement