
Deepak Chahar: ధోనీపై స్లెడ్జింగ్ చేసిన దీపక్.. సరదా మీమ్స్ షేర్ చేసిన సోదరి!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా చైన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ (Deepak Chahar), ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఆదివారం చెన్నై, ముంబయి మధ్య జరిగిన మ్యాచ్‌లో CSK నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్ సందర్భంగా దీపక్ చాహర్‌పై వచ్చిన మీమ్స్‌ను అతడి సోదరి మాలతి చాహర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ నవ్వులు చిందించింది.
ఆ మీమ్‌లో దీపక్ ముంబయి జెర్సీతో ఉన్న ఫొటో కింద, బాహుబలి సినిమాలో ప్రభాస్‌ను కట్టప్ప వెన్నుపోటు పొడిచిన దృశ్యం ఉంది. దీన్ని షేర్ చేసిన మాలతి, నవ్వుతున్న ఎమోజీలను జత చేసింది.
Details
చాహర్ ను ఆటపట్టించి ధోని
దీపక్, ఐపీఎల్‌లో చెన్నై జెర్సీకి గుడ్‌బై చెప్పి ముంబయికి మారిన నేపథ్యంలో, ఈ మీమ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది.
ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చెన్నై ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఎంఎస్ ధోని (MS Dhoni)పై దీపక్ చాహర్ సరదాగా స్లెడ్జింగ్ చేయబోయాడు.
అతడు ధోనీకి దగ్గరగా ఫీల్డింగ్ చేస్తానని చెప్పి, 'ధోనీ.. ధోనీ..' అంటూ చప్పట్లు కొట్టాడు.
కానీ మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ ఈ విషయాన్ని గుర్తుచేసుకుని, చాహర్‌ను తన బ్యాట్‌తో కొట్టినట్లు నటిస్తూ సరదాగా ఆటపట్టించాడు.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Details
చెన్నై నుంచి ముంబయికి.. వేలంలో హైడ్రామా!
2018 నుంచి CSK తరఫున ఆడిన దీపక్ చాహర్‌ను గతేడాది చెన్నై రిటైన్ చేసుకోలేదు.
దీంతో అతను వేలంలోకి వచ్చాడు. సీఎస్కే అతడిని తిరిగి జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నించినా, చివరికి ముంబయి ఇండియన్స్ భారీ మొత్తం రూ. 9.25 కోట్లకు కొనుగోలు చేసింది.
ఈ మ్యాచ్‌లో దీపక్ బ్యాట్‌తో రాణించాడు. ముంబయి ఇన్నింగ్స్ చివర్లో అతడు 15 బంతుల్లో 28 పరుగులు (2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేస్తూ మంచి స్కోర్ అందించాడు.
బౌలింగ్‌లోనూ 2 ఓవర్లలో 18 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగలిగాడు.