Deepti Sharma: యూపీ వారియర్స్ నూతన సారిథిగా దీప్తి శర్మ
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ జట్టు సారథిగా భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మను నియమించింది. కెప్టెన్‌గా ఉన్న అలీసా హీలీ గాయపడటంతో ఆమె స్థానాన్ని దీప్తి భర్తీ చేయనుంది.
గత సీజన్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్న దీప్తికి ఇప్పుడు పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. అలీసా హీలీ కుడి పాదానికి గాయమైన కారణంగా లీగ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.
దీంతో యూపీ వారియర్స్ బ్యాటింగ్ లైనప్‌పై ప్రభావం పడే అవకాశముంది. ఈ క్రమంలో మేనేజ్‌మెంట్, దీప్తి శర్మను నాయకత్వానికి ఉత్తమ ఎంపికగా భావించింది.
Details
మూడోవ భారతీయ కెప్టెన్
దీప్తి శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం ద్వారా ఓ ప్రత్యేక జాబితాలోకి ఎంట్రీ ఇచ్చింది. డబ్ల్యూపీఎల్‌లో ఓ జట్టుకు సారథిగా వ్యవహరించనున్న మూడో భారతీయ క్రికెటర్‌గా నిలిచింది.
ఇప్పటికే స్మృతి మంధాన (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), హర్మన్‌ప్రీత్ కౌర్ (ముంబయి ఇండియన్స్) కెప్టెన్లుగా ఉన్నారు. గతేడాది యూపీ వారియర్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా దీప్తి శర్మ నిలిచింది.
మొత్తం 295 పరుగులు చేసి, ఓవరాల్‌గా ఐదో అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్‌గా నిలిచింది.
బౌలింగ్‌లోనూ ఆమె 10 వికెట్లు తీసింది.