Deepti Sharma: దీప్తి శర్మ అదిరిపోయే స్పెల్.. 7 బంతుల్లో 3 వికెట్లు.. ప్రపంచ రికార్డు సొంతం!
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల ఆసియా కప్ 2026లో టీమిండియా శుభారంభం చేసింది. పసికూన థాయ్‌లాండ్‌పై 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయానికి సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కీలకంగా నిలిచింది. అద్భుతమైన స్పెల్‌తో థాయ్‌లాండ్ బ్యాటర్లను కట్టడి చేసిన దీప్తి.. తన ఖాతాలో అరుదైన రికార్డును కూడా వేసుకుంది. థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌లో దీప్తి శర్మ కేవలం ఏడు బంతులు మాత్రమే వేసింది. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టింది. దీంతో అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో సున్నా పరుగులకే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా దీప్తి ఘనత సాధించింది. అంతేకాకుండా అంతర్జాతీయ మహిళల టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ దీప్తి శర్మ రికార్డు సృష్టించింది.
వివరాలు
150+ టీ20 మ్యాచ్‌లు.. మూడో భారత క్రికెటర్
ఇప్పటివరకు 150 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆమె 171 వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలో థాయ్‌లాండ్ బౌలర్ పుత్తావోంగ్ రికార్డును దీప్తి అధిగమించింది.
పుత్తావోంగ్ 109 మ్యాచ్‌ల్లో 170 వికెట్లతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా 150 లేదా అంతకంటే ఎక్కువ టీ20 మ్యాచ్‌లు ఆడిన మూడో భారత మహిళా క్రికెటర్‌గా కూడా దీప్తి శర్మ నిలిచింది.
ఇప్పటివరకు ఈ ఫీట్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన మాత్రమే సాధించారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 150కు పైగా టీ20 మ్యాచ్‌లు ఆడిన 12వ ప్లేయర్‌గా దీప్తి నిలిచింది.
ఈ జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్ 203 మ్యాచ్‌లతో అందరికంటే ముందుంది.
వివరాలు
దీప్తి, షెఫాలీ కీలక ప్లేయర్లు: హర్మన్‌ప్రీత్
అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో 200కుపైగా టీ20 మ్యాచ్‌లు ఆడిన ఏకైక మహిళా క్రికెటర్ కూడా హర్మన్‌ప్రీత్ కావడం గమనార్హం.
థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ 64 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించగా.. బౌలింగ్‌లో దీప్తి శర్మ 0/3తో అద్భుత ప్రదర్శన చేసింది.
వీరిద్దరి ఆటతీరుపై భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రశంసలు కురిపించింది. అలాగే టోర్నీలో ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేసింది.
'మాకు ఇది మంచి ఆరంభం. ఇక్కడ బ్యాటింగ్ చేయడం కాస్త కష్టంగా ఉంది. అయినప్పటికీ మేం బ్యాటింగ్‌లో రాణించాం.
కొన్ని మంచి షాట్లను ఆడలేకపోయాం. అయితే షెఫాలీ వర్మ అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించింది.
వివరాలు
ఏ జట్టునూ మేం తేలిగ్గా తీసుకోవడం లేదు
మళ్లీ ఆమె బ్యాటింగ్ లయలోకి రావడం ఆనందంగా ఉంది. ఆమెతోపాటు దీప్తి శర్మ కూడా మాకు కీలకమైన ప్లేయర్.
ఎంతో అనుభవం ఉన్న ఆమె ఎప్పుడూ జట్టుకు బలమే. ఇక థాయ్‌లాండ్ బౌలర్లు కూడా మాకు కాస్త సవాల్ విసిరారు.
అందుకే ఏ జట్టునూ మేం తేలిగ్గా తీసుకోవడం లేదు. గతంతో పోలిస్తే థాయ్‌లాండ్ జట్టు ఎంతో మెరుగైందని హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది.