LOADING...
Womens World Cup 2025 : ఆస్ట్రేలియా చేతిలో ఓటమి.. భారత జట్టుకు ఐసీసీ భారీ షాక్!
ఆస్ట్రేలియా చేతిలో ఓటమి.. భారత జట్టుకు ఐసీసీ భారీ షాక్!

Womens World Cup 2025 : ఆస్ట్రేలియా చేతిలో ఓటమి.. భారత జట్టుకు ఐసీసీ భారీ షాక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2025
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత జట్టు ఆవకాశాలు సంక్లిష్టం అవుతున్నాయి. ప్రారంభంలో వారం రోజుల్లో శ్రీలంక, పాకిస్థాన్‌పై రెండు విజయాలు సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు, ఆ తరువాత వరుసగా రెండు మ్యాచ్‌లలో పరాజయం చవిచూసింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాకు ఎదురుగా మ్యాచ్‌ ఓడిపోవడం భారత సెమీస్ ఆశలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా పై 330 పరుగుల లక్ష్యం సెట్ చేసినా, భారత్ ఆ మ్యాచ్‌ని కాపాడలేకపోయింది. ఈ పరాజయం వల్ల జట్టుకు మరో షాక్ తగిలింది. ఐసీసీ టీమిండియా‌పై జరిమానా విధించింది. విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియా‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓవర్ రేటు స్లోగా ఉన్న కారణంగా ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుల్లో 5 శాతం జరిమానా విధించారు.

Details

పాయింట్ల పట్టికలో నాల్గో స్థానం

ఐసీసీ ప్రవర్తనా నియమావళి 2.22 ప్రకారం భారత్ నిర్దేశిత సమయానికి ఓవర్‌ల కోటాను పూర్తి చేయలేదు. ఒక్క ఓవర్ తక్కువగా వేయడం వల్ల ఫైనల్ షిక్షా విధించారు. జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తప్పుడు ప్రవర్తనను అంగీకరించారు. ఐసీసీ ప్రకటనలో ఇది తుది శిక్ష, తదుపరి విచారణ ఉండదని తెలిపింది. ప్రస్తుతం టీమిండియా పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్ అక్టోబర్ 19న ఇండోర్‌లో ఇంగ్లాండ్‌తో జరగనుంది. మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. భారత్ సెమీస్‌లో చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలు తప్పక సాధించాలి. అప్పుడు ఎలాంటి సమీకరణాలపై ఆధారపడకుండా జట్టు సెమీస్‌లో అడుగుపెడుతుంది.