Page Loader
WPL: యూపీ వారియర్జ్‌ను ఓడించి ఫైనల్‌కి దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఫైనల్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్

WPL: యూపీ వారియర్జ్‌ను ఓడించి ఫైనల్‌కి దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2023
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ప్రీమియర్ లీగ్ 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 26న జరిగే ఫైనల్ మ్యాచ్ లోకి నేరుగా ప్రవేశించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్ప్ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సాధించింది. ఓపెనర్లు మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత షెఫాలీ 21 పరుగులు చేసి ఔటైంది.

మెక్‌గ్రాత్

హాఫ్ సెంచరీతో రాణించిన మెక్‌గ్రాత్

ఓకానొక దశలో ఢిల్లీ 70 పరుగుల స్కోరు వద్ద 3 వికెట్లను కోల్పోయింది. అయితే మారిజానే కేప్, అలిస్ కెప్సీ అద్భుతంగా రాణించి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యూపీ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ 3 వికెట్లు పడగొట్టింది. ఢిల్లీ తరుపున తహ్లియా మెక్‌గ్రాత్ 32 బంతుల్లో (8 ఫోర్లు, 2 సిక్సర్లు) 58* పరుగులు చేసింది. మెక్‌గ్రాత్ మహిళల ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచింది. ఢిల్లీ బౌలర్లలో అలిస్ కెప్సీ 3 వికెట్లు తీయగా.. రాధా యాదవ్ 2 వికెట్లు పడగొట్టింది.