WPL: 9ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన ఢిల్లీ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల ప్రీమియర్ లీగ్ 18వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసింది. తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ కి 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 109 పరుగులు చేసింది.
దీంతో ఢిల్లీ తొమ్మిది ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 110 పరుగులు చేసి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఏడు మ్యాచ్ ల్లో ఐదు విజయాలు సాధించిన ఢిల్లీ 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
ఢిల్లీ క్యాపిటల్స్
రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు
ముంబై తరుపున పుజా వస్త్రాకర్ అత్యధికంగా 26 పరుగులను చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 23, ఇస్సి వాంగ్ 23, అమంజోత్ కౌర్ 19 పరుగుల వద్ద ఔటయ్యారు. నాటాలీ సెవార్డ్ బ్రంట్ ఖాతాను కూడా ఔటైంది. ఢిల్లీ బౌలర్లలో మారిజాన్ క్యాప్ కిల్లర్, శిఖా పాండే, జెస్ జోనాసెన్ లు తలా రెండు వికెట్లు సాధించారు.
ఢిల్లీ తరుపున కెప్టెన్ మెన్ లానింగ్, అలిస్ క్యాప్సీ, షెఫాలీ వర్మ బ్యాటింగ్ లో విజృంభించారు. క్యాప్సీ అత్యధికంగా 38 పరుగులు చేసింది.
కెప్టెన్ మెగ్ లానింగ్ 22 బంతుల్లో 32 పరుగులు, షెఫాలీ వర్మ 15 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.