WPL: ముంబై ఇండియన్స్ జోరుకు యూపీ వారియర్స్ కు బ్రేకులు వేసేనా..?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. ఇప్పటికి ఆడిన ఐదు మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. యూపీ వారియర్జ్ ఇప్పటివరకు మూడు ఓటములు, రెండు విజయాలను కలిగి ఉంది. నేడు 15వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్జ్ తలపడనుంది. యుపి వారియర్జ్ కెప్టెన్ గ్రేస్ హారిస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్ ఖేల్, కలర్స్ సినిమాల్లో ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30గంటలకు ప్రసారం కానుంది.
ఇరు జట్లలోని సభ్యులు
వరుస విజయాలతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో దూసుకెళ్తున్న ముంబై ఇండియన్స్ కు యూపీ వారియర్జ్ బ్రేకులు వేస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ముంబై ఇండియన్స్ మహిళా జట్టు: యాస్తికా భాటియా (WK), మాథ్యూస్, నాట్‌స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), అమేలియా కెర్, ఇస్సీవాంగ్, హుమైరా కాజీ, ధారగుజ్జర్, అమంజోత్ కౌర్, జింటిమణి కలితా, సైకా ఇషాక్, వస్త్రకర్, హీథర్, గ్రాహం, క్లో ట్రయాన్, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, ప్రియాంక బాలా UP వారియర్జ్ స్క్వాడ్: అలిస్సాహీలీ (wk/c), దేవికావైద్య, కిరణ్ నవ్‌గిరే, మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, సిమ్రాన్ షేక్, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, గయాక్వాడ్, షాబన్‌ఇంబ్లీ ఇస్మాయిల్ , లక్ష్మియాదవ్, పార్షవిచోప్రా, సొప్పదండి యశశ్రీ