NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / WPL: ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ జెయింట్స్ విజయం.. ఫ్లేఆఫ్ ఆశలు సజీవం
    తదుపరి వార్తా కథనం
    WPL: ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ జెయింట్స్ విజయం.. ఫ్లేఆఫ్ ఆశలు సజీవం
    ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన గుజరాత్ జెయింట్స్

    WPL: ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ జెయింట్స్ విజయం.. ఫ్లేఆఫ్ ఆశలు సజీవం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 17, 2023
    11:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహిళల ప్రీమియర్ లీగ్ 14వ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో సత్తా చాటింది. ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టోర్నమెంట్ లో రెండో విక్టరీని నమోదు చేసింది.

    ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఫ్లేఆప్‌కి ప్రవేశించాలని అనుకున్న ఢిల్లీ నిరాశే మిగిలింది. గుజరాత్ జాయింట్స్ ఆరు మ్యాచ్‌లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.

    చేజింగ్ లో ఢిల్లీ బ్యాటర్లు విఫలం కావడంతో ఈ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో ఓటమిని చవి చూసింది.

    అష్ గార్డ్‌నర్‌

    అష్ గార్డ్‌నర్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్

    తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు సాధించింది. ఓపెన‌ర్ లారా వోల్వార్డ్త్‌(57), అష్ గార్డ్‌న‌ర్ (51) అర్ధ శ‌త‌కాల‌తో రాణించారు.

    లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీకి శుభారంభం లభించలేదు. రెండో ఓవర్లోనే షఫాలీ వర్మ(8) బౌల్డ్ అయింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లను కోల్పోయింది. 52 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది.

    చివర్లో అరుంధతి రెడ్డి (25) బ్యాట్ ఝుళిపించినా, తానియా భాటియా(0), రాధాయాదవ్ విఫలమయ్యారు. దీంతో ఢిల్లీ ఓటమిపాలైంది. ఢిల్లీ తరుపున అష్ గార్డ్ నర్(51) అర్ధ సెంచరీతో పాటు రెండు వికెట్లు తీయడంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్ జెయింట్స్
    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    గుజరాత్ జెయింట్స్

    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటనున్న గుజరాత్ జెయింట్స్ క్రికెట్
    WPL: గుజరాత్ జెయింట్స్ కు గట్టి ఎదురుదెబ్బ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL : ముంబై ఇండియన్స్‌తో తలపడనున్న గుజరాత్ జెయింట్స్ క్రికెట్
    WPL 2023: ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ విజయం క్రికెట్

    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్

    ఐపీఎల్ ఉమెన్స్ ప్లేయర్ల వేలం తేదీలు ఖరారు..? క్రికెట్
    మార్చి 4నుంచి 26 వరకు ముంబాయిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్
    మార్చి 4న మహిళల ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్
    లక్నో ఫ్రాంచైజీకి యుపీ వారియర్జ్‌గా నామకరణం క్రికెట్

    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్

    WPL వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    దీప్తిశర్మకు షాక్.. యూపీ వారియర్స్ కెప్టెన్‌గా అలిస్సాహీలీ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    మహిళల ఐపీఎల్ మస్కట్ చూస్తే గూస్‌బంప్స్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై భారీ అంచనాలు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025